2023 సినీ రౌండప్.. యువహీరోలదే డామినేషన్!

ఏడాది ప్రారంభంలో దసరాతో సూపర్ హిట్ సాధించిన నాని.. హాయ్ నాన్నతో మరో చక్కటి విజయాన్ని అందుకున్నారు.

Update: 2023-12-12 11:30 GMT

2023లో టాలీవుడ్ అగ్ర హీరోలు పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అయితే అది కొన్ని నెలలకు మాత్రమే పరిమితమైంది. మిగతా ఏడాదంతా చిన్న, మీడియం రేంజ్ హీరోల చిత్రాలే బాక్సాఫీస్ నడిపించాయి. అయితే 2023లో వీరి ఆధిపత్యమే ఎక్కువగా కనిపించింది. ఒకరిద్దరు తప్ప మిగతా యంగ్ హీరోలంతా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కొందరి సినిమాలు హిట్ అవ్వగా.. మరికొందరివి ఫట్ అయ్యాయి. మరి ఏఏ సినిమాలు వచ్చాయి? వాటి పరిస్థితేంటి? ఓ సారి 2023ను చుట్టేద్దాం రండి.

నేచురల్ స్టార్ నానికి 2023 బాగా కలిసొచ్చింది. ఏడాది ప్రారంభంలో దసరాతో సూపర్ హిట్ సాధించిన నాని.. హాయ్ నాన్నతో మరో చక్కటి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు సరిపోదా శనివారంతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్ తేజ్.. గతేడాది ఒక్క చిత్రాన్నికూడా రిలీజ్ చేయలేకపోయారు. కానీ ఈసారి మాత్రం రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అలరించారు. వేసవిలో వచ్చిన విరూపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ అయింది. పవన్ కల్యాణ్ తో నటించిన బ్రో చిత్రం మిశ్రమ ఫలితాన్నే అందుకుంది. ప్రస్తుతం గాంజా శంకర్ మూవీ చేస్తున్నారు.

అక్కినేని వారసుడు నాగచైతన్య ఈఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా చేదు ఫలితమే దక్కింది. కానీ దూత వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు చై.. చందూ మొండేటితో కలిసి తండేల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

లైగర్ తో డిజాస్టర్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఖుషిలో పర్వాలేదనిపించారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబ్టటింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ కూడా 2024 మార్చిలో విడుదల కానుంది.

2023లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలుతో వరుస విజయాలు అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి.. అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అలరించారు. మరో యంగ్ హీరో శ్రీవిష్ణు.. సామజవరగమనతో సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. కార్తికేయకు ఈఏడాది బెదురులంక 2012తో కాస్త ఊరట దక్కింది.

అయితే మరికొందరి చిన్న, మీడియం రేంజ్ హీరోలకు కలిసిరాలేదు. గోపీచంద్, నితిన్, కల్యాణ్ రామ్, నాగశౌర్య, వరుణ్ తేజ్ కు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. బింబిసారతో గతేడాది హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. అమిగోస్ తో ఫ్లాప్ టాక్ అందుకున్నారు. గత కొన్నాళ్లుగా సరైన విజయాలు అందుకోని గోపీచంద్‌కు కూడా ఈ ఏడాది కలిసిరాలేదు. రామబాణంతో మెప్పించలేకపోయారు. నాగశౌర్య నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

ఇక యువ హీరోలు రామ్ స్కందతో, నిఖిల్‌ స్పైతో, అఖిల్‌ ఏజెంట్‌ తో, సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ తో, విష్వక్‌ సేన్‌ దాస్‌ కా దమ్కీతో, వైష్ణవ్‌ తేజ్‌ ఆదికేశవతో, సుధీర్‌బాబు హంట్‌, మామామశ్చీంద్రలతో అభిమానులను నిరుత్సాహపరిచారు. కిరణ్ అబ్బవరం, సంతోశ్ శోభన్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.

Tags:    

Similar News