దేవర 'జాన్వీ' క్యారెక్టర్… ఎలా ఉంటుందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది.

Update: 2024-09-23 07:12 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ‘దేవర’ మూవీ సెకండ్ ట్రైలర్ ని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ‘దేవర’ స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అని బజ్ చూస్తేనే అర్ధమవుతుంది.

ఇక బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దేవర’తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. మంచి టాలెంటెడ్ యాక్టర్ అంటూ కొనియాడారు. దీంతో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. అలాగే సౌత్ లో శ్రీదేవికి చాలా మంది అభిమానులు ఉన్నారు.

ఆమె కూతురు సౌత్ డెబ్యూ మూవీ కావడంతో శ్రీదేవిని గుర్తుచేసుకునే వారు చాలా మంది ఉన్నారు. సౌత్ ఆడియన్స్ ని జాన్వీ కపూర్ తన పెర్ఫార్మెన్స్ తో ఏ మేరకు మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ‘దేవర’ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు జాన్వీ కపూర్ క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ గురించి ఇంటరెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. దేవర మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ సెకెండాఫ్ లో వస్తుందని చెప్పారు.

ఆమె తంగం అనే క్యారెక్టర్ లో నటిస్తోంది. దేవర మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా యునిక్ గా ఉంటుందని తెలిపారు. కచ్చితంగా థియేటర్స్ నుంచి ఆడియన్స్ బయటకి వెళ్ళినపుడు జాన్వీ కపూర్ చేసిన తంగం క్యారెక్టర్ ని గుర్తు చేసుకుంటారని అన్నారు. సుమారు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో మొదటి భాగం అంతా కూడా దేవర క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. సెకెండాఫ్ లోనే జాన్వీ కపూర్ తంగం, ఎన్టీఆర్ వర క్యారెక్టర్స్ వస్తాయని అంటున్నారు.

వీరి కథతోనే ‘దేవర పార్ట్ 2’కి లీడ్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. జాన్వీ కపూర్ కెరియర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. అలాగే స్టార్ హీరోతో చేస్తోన్న కమర్షియల్ సినిమా కూడా ‘దేవర’నే. అందుకే ఆమెకి ‘దేవర’ సక్సెస్ చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితే జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ మూవీ ఆమెకి ఎలాంటి పేరు తీసుకొస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News