పూరి మళ్ళీ బాలీవుడ్ సెంటిమెంట్
ఇది రిలీజ్ కి రెడీ చేస్తూనే రామ్ పోతినేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లిపోయారు
స్కంద సినిమాతో రామ్ పోతినేని సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ చిత్రం కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ కెరియర్ లోనే ఈ సినిమాపై హైయెస్ట్ బిజినెస్ జరిగింది. థీయాట్రికల్ రైట్స్ ద్వారానే 50 కోట్ల వరకు డీల్స్ జరిగాయి. రామ్ ప్రస్తుతం ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు.
ఇది రిలీజ్ కి రెడీ చేస్తూనే రామ్ పోతినేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లిపోయారు. లైగర్ డిజాస్టర్ కారణంగా ఏడాది గ్యాప్ తీసుకున్న పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీని స్టార్ట్ చేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కీలక ఎపిసోడ్స్ కూడా తెరకెక్కించారు. సంజయ్ దత్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే కావ్యా థాపర్ ఒక హీరోయిన్ గా ఖరారైంది. ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంది. రామ్ పోతినేని, కావ్య థాపర్ మీద కొన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారు.
మెయిన్ లీడ్ గా సారా అలీఖాన్ ని పూరి జగన్నాథ్ ఎంపిక చేశారంట. బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న ఫీమేల్ లీడ్స్ లో సారా అలీఖాన్ కి మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు హీరోయిన్ గా కూడా ఆమెని ఎంపిక చేయడం ద్వారా బాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో బేబీ హీరోయిన్ వైష్ణవిని సెకండ్ లీడ్ గా తీసుకున్నారనే ప్రచారం నడిచింది.
అందులో వాస్తవం లేదని దీంతో క్లారిటీ వచ్చింది. ఇక డబుల్ ఇస్మార్ట్ స్టోరీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గానే ఉండనుంది. మరి ఇందులో సారా అలీఖాన్, కావ్యా థాపర్ ఎలాంటి రోల్స్ పోషించారనేది తెలియాల్సి ఉంది.