కత్రిన ఫ్రెగ్నెన్సీపై నెటిజనులు సందేహాలు
`మల్లీశ్వరి` కత్రిన యువహీరో విక్కీ కౌశల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
`మల్లీశ్వరి` కత్రిన యువహీరో విక్కీ కౌశల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తలను ఆ ఇద్దరిలో ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. రకరకాల పుకార్ల నడుమ కత్రిన లండన్‌లో దాదాపు మూడు నెలల సుదీర్ఘ సెలవుల్లో గడిపింది. ఈ ఆదివారం తెల్లవారుజామున ముంబైకి తిరిగి వచ్చింది. ఇంతలోనే బోలెడన్ని డౌట్లు!
విమానాశ్రయం నుంచి వెళుతూ ఉన్నప్పుడు కత్రినపై కెమెరా ఫ్లాష్ లు మెరిసాయి. చాలా ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. క్యాట్ విమానాశ్రయం నుండి బయటికి వచ్చినప్పుడు షైనీ లుక్ తో కనిపిస్తుంది. సౌకర్యవంతమైన మినిమలిస్టిక్ మేకప్ తో కనిపించింది. బ్లాక్ కలర్ దుస్తులు ధరించిన కత్రిన నల్లటి ట్రెంచ్ కోట్తో కూడా వేసుకుంది. ఫోటోగ్రాఫర్లు కత్రిన వెంటపడి మరీ ఫోటోలు తీసారు. తన వెంటపడుతున్న స్టిల్ ఫోటోగ్రాఫర్ల ముందు ఒక స్మైల్ ఇచ్చి భాయ్ చెప్పి మరీ వెళ్లిపోయింది.
అయితే కత్రిన లుక్ ని జాగ్రత్తగా పరిశీలించిన వారు తన బేబి బంప్ ఏమైనట్టు? అంటూ సందేహిస్తున్నారు. ఈ లుక్‌పైనా, కత్రిన బేబి బంప్ పైనా నెటిజనులు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. నగరానికి తిరిగి వచ్చిన కత్రిన తన బేబీ బంప్‌ను దాచడానికి వదులుగా ఉన్న నల్లటి దుస్తులు, ట్రెంచ్ కోట్ ధరించిందని నెటిజనుల్లో కొందరు ఊహిస్తున్నారు. అసలు బేబి పుడుతుందా లేదా? అని కూడా కొందరు నెటిజనులు డిబేట్ స్టార్ట్ చేసారు. అయితే కత్రిన ప్రస్తుతం తనకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడడం లేదు. కత్రిన కానీ, విక్కీ కానీ ఫ్రెగ్నెన్సీ వార్తలను ఇప్పటివరకూ కన్ఫామ్ చేయనే లేదు. దీంతో రకరకాలుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మార్చిలో గుజరాత్ జామ్‌నగర్‌లో అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న కత్రినా- విక్కీ కౌశల్ మీడియా దృష్టికి దూరంగా ఉన్నారు. వేడుక ముగిసిన వెంటనే ఇద్దరూ లండన్‌కు బయలుదేరారు. కత్రిన లండన్ లోనే వెకేషన్ లో ఉండగా అక్కడే పురుడు పోస్తారని కూడా ప్రచారం సాగిపోయింది. కానీ దానిని కత్రిన కన్ఫామ్ చేయలేదు. విక్కీ పలుమార్లు ముంబై టు లండన్ ప్రయాణాలు చేస్తూ కనిపించాడు. లండన్‌కు వెళ్లేప్పుడు ఈ జంటకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో కనిపించాయి. ఈ జంట గర్భధారణ పుకార్లను ధృవీకరించలేదు లేదా ఖండించలేదు.