ప‌ద్మ శ్రీ గ్ర‌హీత కొండ‌ప్ప‌కు 'బ‌లగం' స‌న్మానం

దాసరి కొండప్పని దిల్ రాజు ఆఫీస్ కి తీసుకొచ్చి ఆయనతో ఓ పాట పాడించి దిల్ రాజు- వేణు చిత్రయూనిట్ ఆయన్ని ఘ‌నంగా స‌న్మానించింది.

Update: 2024-02-03 16:27 GMT
ప‌ద్మ శ్రీ గ్ర‌హీత కొండ‌ప్ప‌కు బ‌లగం స‌న్మానం
  • whatsapp icon

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు కూడా పద్మశ్రీ ప్రకటించారు. కొనేళ్ల‌గా పల్లెజానపదాలు పాడుతూ తెలంగాణ సంసృతిని చాటుతున్నారు కొండ‌ప్ప‌. ఈ నేప‌థ్యంలో బుర్ర‌వీణ క‌ళాకారుడిగా ఆయ‌న సేవ‌ల్ని గుర్తించి ప్ర‌భుత్వం ప‌ద్మ శ్రీతో స‌త్క‌రించింది.

కొండ‌ప్ప దిల్ రాజు నిర్మా ణంలో వేణు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'బ‌లగం' చిత్రంలో కూడా త‌న గాత్రాన్ని వినిపించ‌డంతో పాటు న‌టించారు. ఈ నేప‌థ్యంలో కొండ‌ప్ప‌కి ప‌ద్మ శ్రీ వ‌రించ‌డంతో 'బలగం' చిత్ర యూనిట్ ఆయన్ని స‌న్మానించింది. దాసరి కొండప్పని దిల్ రాజు ఆఫీస్ కి తీసుకొచ్చి ఆయనతో ఓ పాట పాడించి దిల్ రాజు- వేణు చిత్రయూనిట్ ఆయన్ని ఘ‌నంగా స‌న్మానించింది.

అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని కొండ‌ప్ప‌కు అందించారు. ఆ డబ్బులని ఆ పెద్దాయన కోసం మాత్రమే వాడాలని దిల్ రాజు చెప్పారు. దానికి సంబంధించిన ఓ వీడియో ని రాజుగారి సోష‌ల్ మీడియా టీమ్ నెట్టింట వ‌దిలింది. దీంతో సినీ-రాజ‌కీయ ప్రముఖులు దిల్ రాజుని అభినందిస్తున్నారు. క‌ళాకారుల్ని ప్రోత్స‌హించ‌డంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. ప్ర‌తిభావంతుల్ని వెలికి తీయ‌డంలో ఆయ‌న ప్ర‌త్యేక‌త వేరు.

ఆయ‌న నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది కొత్త వారు తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌మ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. వేణు ని కూడా ఆయ‌నే బ‌లగంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసారు. ప్ర‌స్తుతం అదే నిర్మాణ సంస్థ‌లో నేచురల్ స్టార్ నాని హీరోగా వేణు ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఎల్ల‌మ్మ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.



Tags:    

Similar News