దుల్కర్-అమల్ సూఫియా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ!
ఆ వయసులో అమల్ సూఫియాని చూసి ఇంత చిన్న పిల్లా అని అనుకునేవాడుట
దుల్కర్ సల్మాన్-అమల్ సూపియా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీళ్లిద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు? అని ఎంత మందికి తెలుసు. అవును దుల్కర్-అమల సూఫియా పెళ్లి కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది. ఇద్దరు చిన్నప్పటి నుంచి తెలుసు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అయితే క్లాస్ మేట్స్ కాదు. దుల్కర్ కంటే అమల్ సూఫియా ఐదేళ్లు చిన్నది. దుల్కర్ ఇంటర్మీడియట్ చదువుతుంటే...అమల్ సూఫియా 7వతరగితి చదివేదిట.
ఆ వయసులో అమల్ సూఫియాని చూసి ఇంత చిన్న పిల్లా అని అనుకునేవాడుట. కట్ చేస్తే ఆ చిన్న పిల్లే తన భార్య అయిందంటున్నాడు. దుల్కర్ కి పెళ్లి వయసు రావడంతో ఇంట్లో పెళ్లి సంబంధాలు గురించి నిత్యం చర్చ జరిగేదిట. వారి ఆలోచనలకు విరుద్దంగా దుల్కర్ ఆలోచించే వాడుట. అలాగని పెద్దలు చూసిన ఏ అమ్మాయి అంగీకరించింది లేదు..తిరస్కరించనులేదు. వాళ్ల మనోభావాలు దెబ్బ తీయకుండా నడుడచుకున్నాడుట.
అప్పటికే దుల్కర్ వీణ చెన్నై లో మ్రోగుతుందిట. అమల్ సూఫియా చెన్నైలో ఉండేదిట. ఆ సమయంలో రెండు వారాల పాటు ఆమెతో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ కలయిక చాలా యాదృశ్చికంగా జరిగిందిట. అనుకోకుండా కొంత మంది స్నేహితులు థియేటర్ వద్దా..సెలూన్ వద్ద కలిసినట్లే అమల్ సూఫియా కూడా ఫేస్ బుక్ ద్వారా టచ్ లోకి కలిసిందిట. ఆతర్వాత తొలిసారి ఇద్దరు కాఫీ కోసం కలుద్దాం అని చెన్నైలో మీట్ అయ్యారుట. అయితే ఈ స్టోరీ అంతా దుల్కార్ తల్లిదండ్రులకు తెలుసుట.
తాను అన్ని చెప్పే చేసినట్లు తెలిపాడు. కాఫీ కోసం కలవడం సంగతి కూడా ఇంట్లో ముందుగానే చెప్పి చేసాడుట. ఆ సమయంలో కేవలం స్నేహితులుగానే కలుస్తున్నాం..అలాగే ఉంటామని చెప్పాడుట. ఆ కాపీ డే ముగిసిన మరుసటి రోజూ అమల్ సూఫియాని మళ్లీ కలిసాడుట. అలా కలవడం కోసం చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్లాడు. అప్పుడు అమల్ సూఫియా పాండిచ్చేరిలో ఉందిట. అదే నా భార్యతో మొదటి డేట్ అంటూ చెప్పుకొచ్చాడు. చెన్నై నుంచి పాండిచ్చేరికి గంటన్నర్ లో డ్రైవ్ చేసి వెళ్లినట్లు తెలిపాడు. అక్కడ దాదాపు నాలుగు గంటలు పాటు మాట్లాడుకున్నట్లు జీవితంలో ఆ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం అంటున్నాడు.