DVV సినిమాలు.. ఈ రెండు లెక్కలు తేలేది ఎప్పుడో..

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు కొన్ని ఫ్యాన్స్ లో ఊహించని విధంగా కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి.

Update: 2024-06-03 07:30 GMT

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు కొన్ని ఫ్యాన్స్ లో ఊహించని విధంగా కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ OG, నాని-సుజీత్ సినిమాలు విడుదలకు సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు సినిమాల వెనుక ఉన్న వాయిదా కారణం ఏమిటి అనే విషయంలో చాలా రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు సరైన క్లారిటీ ఎవరు ఇవ్వలేదు.

DVV ఎంటర్టైన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ లోనే ఈ రెండు సినిమాలు ఉన్నాయి. RRR వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించిన ఈ సంస్థ , 2024లోనే ఈ రెండు సినిమాలను నిర్మిస్తుందని ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనల తర్వాత, వారు అడ్వాన్స్‌డ్ OTT డీల్స్ కోసం ప్రయత్నించారు. కానీ ఈ డీల్స్ సక్సెస్ కాకపోవడంతో, ఈ రెండు చిత్రాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది.

ఇప్పటికే OG ప్రాజెక్టు పూర్తయ్యింది. దాని డీల్ ఎప్పుడో ఒకప్పుడు సెట్ కావచ్చు. అయితే ఈ పరిణామం వల్ల నాని-సుజీత్ సినిమా రద్దు చేయబడింది. ఇంకా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు రాలేదు. అందుకే మేకర్స్ రిస్క్ ఎందుకని ముందే వెనక్కి తగ్గారు. ఇక పవన్ కల్యాణ్ #OG సినిమా యొక్క అసలు విడుదల తేదీ సెప్టెంబర్ 27 నుండి వాయిదా పడింది.

ఈ వార్తలు ఫిల్మ్ నగర్ లో విస్తృతంగా చర్చకు దారి తీసాయి, మరియు ఈ రెండు సినిమాల అభిమానులు కొత్త అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని-సుజీత్ సినిమాకు కొత్త నిర్మాత దొరికే అవకాశం ఉన్నప్పటికీ #OG చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌తో కుదిరే డీల్ ఆధారంగా 2025లో మాత్రమే థియేటర్లలో విడుదల కానుంది. DVV ఎంటర్టైన్‌మెంట్ ఈ సినిమాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, ప్రత్యేకంగా అభిమానులను నిరాశపరిచాయి. కానీ వారు ఈ సినిమాలను అత్యుత్తమంగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.

ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ఈ రెండు చిత్రాలపై ఉన్నాయి. నాని-సుజీత్ చిత్రం కొత్త నిర్మాతతో ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవుతుందా లేదా అనే ఆసక్తి ఉంది. అలాగే పవన్ కల్యాణ్ #OG చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో అన్న విషయంపై ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. DVV ఎంటర్టైన్‌మెంట్ వారి తదుపరి ప్రకటనలను ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News