సంక్రాంతి యుద్ధంలో మాస్ ఈగల్
పండక్కు గట్టి పోటీ ఉన్నప్పటికీ.. సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌ను ఉన్న డిమాండ్ గురించి తెలిసిందే. యంగ్ హీరోస్ టు బడా స్టార్స్ చాలా మంది ఈ పండక్కే వచ్చి పైసా వసూలు చేసుకుని వెళ్లిపోయేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. చాలా మంది హీరోలకు ఈ ముగ్గుల పండగ సెంటిమెంట్ కూడా. వీరిలో మాస్ మాహారాజా రవితేజకు కూడా ఒకరు.
ఆయన నటించిన పోలీస్ డ్రామా క్రాక్ కూడా సంక్రాంతి బరిలోనే దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అందుకే వచ్చే సంక్రాంతికి కూడా మాస్ మాహారాజా వచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ సారి ఈగల్తో రానున్నారు. 'ధమాకా' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి చేసిన చిత్రమిది. అందుకే ఈసారి మరింత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు.
పండక్కు గట్టి పోటీ ఉన్నప్పటికీ.. సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. కార్తీక్ ఘట్టమనేని ఈ 'ఈగల్' సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా బలంగా ఉంటుందని అంటున్నారు. అందుకే ఈగల్ టీమ్ సంక్రాంతిని టార్గెట్ చేసింది. జనవరి 13న థియేటర్లలోకి రానున్న తాజాగా అనౌన్స్ చేసింది.
ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న దిగబోయే చిత్రాల జాబితా కూడా రోజు రోజుకు భారీగా పెరుగుతూ వస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం ఇప్పటికే రెడీ అయి ఉండగా.. రీసెంట్గా విజయ్ దేవరకొండ - పరశురామ్ చిత్రం, తేజ సజ్జా హనుమాన్ కూడా ముగ్గుల పండక్కే రానున్నట్లు ప్రకటించారు. నాగార్జున నా సామిరంగ కూడా ఆల్మోస్ట్ సంక్రాంతికే కన్ఫామ్ చేసుకుంది. సలార్ దెబ్బతో క్రిస్మస్కు విడుదల అవ్వాల్సిన వెంకీ సైంధవ్ కూడా సంక్రాంతికే అని అంటున్నారు. ఇక కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన అయలాన్ కూడా పతకాల పండక్కే ఖరారైంది. ఇప్పుడు ఈగల్ కూడా వచ్చి చేరిపోయింది.
ఇకపోతే ఈగల్ సినిమా విషయానికొస్తే.. చిత్రంలో మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, మధుబాల ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చూడాలి మరి ఈ చిత్రం మిగితా సినిమాల పోటీని తట్టుకుని ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో...