అంత‌ర్జాతీయ గాయ‌కుడు 'ఊర్వ‌శి ఊర్వ‌శి' ఆలాప‌న‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుప్ర‌సిద్ధులైన ఇద్ద‌రు ప్ర‌ముఖ గాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు ఓ చోట చేరి ర‌చ్చ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ వేదిక‌ను చూసి అర్థం చేసుకోవ‌చ్చు

Update: 2025-02-08 10:24 GMT

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుప్ర‌సిద్ధులైన ఇద్ద‌రు ప్ర‌ముఖ గాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు ఓ చోట చేరి ర‌చ్చ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ వేదిక‌ను చూసి అర్థం చేసుకోవ‌చ్చు. ఆస్కార్ గ్ర‌హీత‌, స్వ‌ర మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ మానియాకు ఎడ్ షీర‌న్ స్వ‌రం జ‌త‌క‌లిస్తే ఇదిగో ఇలాంటి అద్భుతం పుడుతుంది. ఊర్వ‌శి ఊర్వ‌శి అంటూ షీర‌న్ పాట పాడుతుంటే, వేదిక షేక‌య్యేలా రెహ‌మాన్ త‌న గానాలాప‌న‌తో క‌ట్టి ప‌డేస్తుంటే.. ఇది నిజంగా క‌న్నుల పండుగ‌ను త‌ల‌పిస్తోంది.

చెన్నైలో `షేప్ ఆఫ్ యు ఎక్స్ ఉర్వసి` కోసం ఎడ్ షీరన్‌తో కలిసి ఎఆర్ రెహమాన్ వేదిక‌పై సందడి చేసారు. బ్రిట‌న్ కి చెందిన గాయకుడు ఎడ్ షీరాన్ తన మ్యాథ‌మెటిక‌ల్ టూర్ తో భారతదేశం అంతటా తన సంగీత ప్ర‌భావాన్ని విస్త‌రిస్తున్నాడు. బుధవారం నాడు చెన్నైలో షోని ర‌క్తి క‌ట్టించాడు. ఎడ్ `షేప్ ఆఫ్ యు`.. రెహమాన్ `ఊర్వసి` రీమిక్స్ తో ర‌గిలించారు. కచేరీ తర్వాత ఎడ్ షీరన్ ఇన్‌స్టాలో షో నుండి ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో అతడు AR రెహమాన్‌ను వేదికపై ఆహ్వానిస్తూ.. మీరు ఏ.ఆర్ రెహమాన్ కోసం కొంత సౌండ్ చేస్తారా? అని వీక్ష‌కుల‌ను అడిగాడు. ప్రేక్షకులు బిగ్గరగా చీర్స్‌తో విరుచుకుపడ్డారు. ఆ త‌ర్వాత షీర‌న్ రెహ‌మానియా హంగామా మొద‌లైంది. అయితే ఈ ప్రదర్శనలో ఎక్కువ భాగం వినిపించకపోవడంతో రెహమాన్ మైక్‌లో ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థ‌మైంది. ఆ స‌మ‌యంలో ఎడ్ షోని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని రెహ‌మాన్‌కి మద్దతునిచ్చాడు. రెహమాన్ ఊర్వసి పాటను పాడుతుండ‌గా ఫ్యాన్స్ ఉర్రూత‌లూగారు.

ప్రస్తుతం `ది మ్యాథమెటిక్స్ ( -=÷x) టూర్` కోసం ఇండియాలో ఉన్న అంత‌ర్జాతీయ పాప్ గాయ‌కుడు షీరాన్ తన చెన్నై ప్రదర్శనకు ముందు రెహమాన్, అతడి కుమారుడు ఏ.ఆర్ అమీన్‌ను కలిశాడు. అమీన్ స్వ‌యంగా ఈ ఫోటోల‌ను షేర్ చేసారు. అలాగే షీర‌న్ చెన్నైలోని రెహ‌మాన్ స్టూడియోని షీర‌న్ విజిట్ చేసిన ఫోటోలు క‌నిపించాయి. రెహమాన్ కేఎం కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ & టెక్నాలజీ విద్యార్థులతో కలిసి తన లవ్ బల్లాడ్ ని `పర్ఫెక్ట్`గా పాడుతూ క‌నిపించాడు. ఈరోజు చెన్నైలోని @kmmcchennaiలో అద్భుతమైన గాయక బృందంతో అద్భుతంగా పాడుతున్నాను అని షీర‌న్ వ్యాఖ్య‌ను జోడించాడు. షీర‌న్ షో త‌దుప‌రి ఫిబ్రవరి 15న ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రదర్శనతో ముగియ‌నుంది.

Tags:    

Similar News