సరోగసీలో రెండో బిడ్డను కంటున్న లేడీ ప్రొడ్యూసర్
ఇంతకుముందు సరోగసీలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఏక్తా కపూర్. ఇప్పుడు తన రెండవ బిడ్డను కూడా సరోగసీలో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని కథనాలొస్తున్నాయి.
గట్స్ అనే పదానికి మీనింగ్ - ఏక్తా కపూర్. ఎంపిక చేసుకునే కంటెంట్ లో హద్దులు చెరిపేసే బోల్డ్ నెస్ ని వండి వార్చడం తన ప్రత్యేకత. తెరనిండుగా అందాల ప్రదర్శన, ఘాటైన రొమాన్స్ తో రెచ్చగొట్టడం తద్వారా బ్లాక్ బస్టర్ ఫార్ములాను ఏక్తా అనుసరిస్తుంది. దానికోసం ఎంతకైనా సాహసిస్తుంది. ఇంతకుముందు సరోగసీలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఏక్తా కపూర్. ఇప్పుడు తన రెండవ బిడ్డను కూడా సరోగసీలో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని కథనాలొస్తున్నాయి.
ఇటీవల బాలీవుడ్ లైఫ్ ప్రచురించిన కథనం ప్రకారం, ఏక్తా కపూర్ రెండవసారి అద్దె గర్భం ద్వారా తల్లి కాబోతోంది. ఏక్తా తన 5 ఏళ్ల కొడుకు రవికి తోబుట్టువు కావాలంటూ రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నట్లు సదరు ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ పేర్కొంది. ఏక్తా తల్లిదండ్రులు - జీతేంద్ర - శోభా కపూర్ కూడా ఆమె నిర్ణయానికి మద్దతుగా నిలిచారని ఈ కథనం పేర్కొంది.
రూమర్స్ పై ఏక్తా కపూర్ స్పందన:
అయితే ఏక్తా కపూర్‌కి సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ .. ఇవన్నీ తప్పుడు కథనాలు అని తోసిపుచ్చింది. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఏక్తా పీఆర్ వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం ఆమోదయోగ్యం కాదు. గౌరవప్రదంగా, జర్నలిస్టులు ప్రచురించే ముందు సంబంధిత వ్యక్తులతో వాస్తవాలను ధృవీకరించుకోవాలి అని సూచించారు. వీరంతా ఇలాంటి వార్తలను రాయడం చాలా ఫన్నీగా నవ్వు తెప్పిస్తుంది అని సెటైరికల్ గా స్పందించారు.
ఏక్తా కపూర్ తన మొదటి బిడ్డ రవిని 2019లో సరోగసీ ద్వారా స్వాగతించింది. తొలి సంతానానికి ఇప్పుడు ఐదేళ్లు.2023లో ఏక్తా కపూర్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ప్రతిష్టాత్మకమైన డైరెక్టరేట్ అవార్డును గెలుచుకున్న భారతదేశపు మొదటి మహిళా చిత్రనిర్మాతగా చరిత్ర సృష్టించింది.