కృతి శెట్టి.. ఫ్లాప్స్ ఎదురైనా అక్కడ మాత్రం ఫుల్ బిజీ

ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం, వారియర్ సినిమాల్లో తన నటనతో ఆమె ఆకట్టుకున్నా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Update: 2023-12-15 07:25 GMT

బేబమ్మ అంటే చాలు.. టక్కున గుర్తొచ్చేస్తాది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమా ఉప్పెనతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ అమ్మడు. తన చిరునవ్వు, అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం, వారియర్ సినిమాల్లో తన నటనతో ఆమె ఆకట్టుకున్నా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవలే వచ్చిన కస్టడీ కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఆమె క్రేజ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి నటిస్తోంది. అయితే ఇన్ని ఫ్లాప్స్ ఎదురవుతున్నా కూడా అమ్మడు మరోవైపు మిగతా భాషల్లో ఆమె బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం కృతి తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లను అందుకుంటోంది. కోలీవుడ్ లో వరుస సినిమాలను ఓకే చేస్తోంది. తాజాగా స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీలో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించనుంది. ఈ మూవీకి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్- ఎల్ ఐసీగా పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్ బాణీలు అందించనుండగా.. ఎస్ జే సూర్య, యోగిబాబు కీలకపాత్రలు పోషించనున్నారట.

ఈ సినిమా కన్నా ముందు జయం రవి పాన్ ఇండియా ప్రాజెక్ట్ జెనీలోనూ కృతి ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో లీడ్ రోల్ పోషించనుంది. కృతి శెట్టితో పాటు కల్యాణి ప్రియదర్శన్‌, వామిక కబీ కూడా నటిస్తున్నారు. దాదాపు రూ.100కోట్ల భారీ బడ్జెట్ తో వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరీ గణేష్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

మరో స్టార్ హీరో కార్తి నటిస్తున్న వా వాతియారేలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని గ్రీన్స్ పతాకంపై జ్ఞాన్ వేల్ రాజా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు మలయాళ స్టార్ టోవినో థామస్ తీస్తున్న భారీ బడ్జెట్ 3డీ పాన్ ఇండియా చిత్రంలో మెరవనుంది. మరి ఈ సినిమాలు ఆమె కెరీర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News