కల్కి 2.. కర్ణ 3102 BC..!
ఐతే కల్కి 2 గురించి ఒక ఎక్స్ క్లూజివ్ అప్డేట్ రివీలైంది. కల్కి 2 కి టైటిల్ గా కర్ణ 3102 BC అనే టైటిల్ పెట్టబోతున్నారట.
ప్రభాస్ లీడ్ రోల్ లో అమితాబ్, కమల్ హాసన్, దీపిక పదుకొనె నటించిన కల్కి 2898 AD సినిమా రెండో భాగం భారీగా ఉండబోతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన విషయం తెలిసిందే. మహానటి తర్వాత తన థర్డ్ ప్రాజెక్ట్ ను ఇంత భారీ స్కేల్ లో తెరకెక్కిస్తాడని ఎవరు ఊహించలేదు. వైజయంతి బ్యానర్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. కల్కి 1 సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఐతే కల్కి 2898 AD లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూపించాడు నాగ్ అశ్విన్. సినిమాలో అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ నటించారు. సినిమా చివర్లో ప్రభాస్ కర్ణుడిగా రివీల్ చేశారు.
ఇక కల్కి రెండో భాగం మొత్తం అశ్వద్ధామ, కర్ణుడు, అర్జునుడు మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఐతే కల్కి 2 గురించి ఒక ఎక్స్ క్లూజివ్ అప్డేట్ రివీలైంది. కల్కి 2 కి టైటిల్ గా కర్ణ 3102 BC అనే టైటిల్ పెట్టబోతున్నారట. రెండో భాగం భవిష్యత్తు గురించి ఉంటుందని తెలుస్తుంది. మహా భారత కురుక్షేత్రానికి సంబంధించిన రిఫరెన్స్ లు కూడా ఉంటాయని టాక్. కర్ణ, అర్జున మధ్య యుద్ధ సన్నివేశాలు కూడా ఉంటే అవకాశం ఉందని తెలుస్తుంది.
కల్కి 2 లో సుప్రీం యాస్కిన్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు. మొత్తానికి కల్కి 1 లో చివరి పది నిమిషాల్లో చూపించిన వార్ ని కల్కి 2 లో అదే కర్ణ 3102 BC లో అదే హైలెట్ గా చూపించనున్నరని తెలుస్తుంది. ఐతే ఇప్పటికే ప్రభాస్ కర్ణుడిగా రివీల్ కాగా అర్జునుడిగా విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. సినిమాలో కృష్ణుడి పాత్రని అలానే ఎలాంటి ముఖం చూపించకుండానే చేయాలని అనుకుంటున్నాడట నాగ్ అశ్విన్.
ఏది ఏమైనా నాగ్ అశ్విన్ కల్కి 2 ప్లాన్ భారీ రేంజ్ లోనే ఉందని చెప్పొచ్చు. కల్కి 2 కచ్చితంగా ఊహించిన దాని కన్నా పెద్దగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కల్కి 2 నిజంగానే కర్ణ 3102 BCగా వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కల్కి 2 సినిమా షూటింగ్ నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లనుంది. కల్కి సెకండ్ పార్ట్ కి సంబంధించి కూడా కొంత షూట్ అయిపోయింది కాబట్టి సినిమాను అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని కోరుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.