ఎక్స్ ట్రా.. నష్టాలు మొత్తం ఏ రేంజ్ లో అంటే!
అలా కాకుండా యాక్షన్ హీరోగా తనని తాను రిప్రజెంట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఫెయిల్యూర్స్ సొంతం చేసుకున్నారు.
ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో నితిన్. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నితిన్ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ గా అతను సినిమాలు చేసిన ప్రతిసారి సక్సెస్ అందుకున్నాడు. అలా కాకుండా యాక్షన్ హీరోగా తనని తాను రిప్రజెంట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఫెయిల్యూర్స్ సొంతం చేసుకున్నారు.
తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రార్డినరీ మెన్ మూవీతో నితిన్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే ఈ చిత్రాన్ని దర్శకుడు వక్కంతం వంశీ ఆవిష్కరించారు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ప్రతి మీమ్ ని సినిమాలో డైలాగ్స్ గా వాడుకున్నారు. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా డిజైన్ చేశారు.
అయిన కూడా ఈ సినిమాకి నితిన్ కెరియర్ లోనే లోయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. స్పందన కూడా ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదు. పర్వాలేదనే టాక్ ఆడియన్స్ నుంచి వచ్చింది. అయితే ఎక్స్ట్రార్డినరీ, హాయ్ నాన్న సినిమాలలో ఫస్ట్ ఛాయస్ గా నాని మూవీనే ఎంచుకున్నారు. దీంతో నితిన్ ఎక్స్ట్రార్డినరీ మెన్ కలెక్షన్స్ పై ప్రభావం పడింది.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 4.43 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. 23.3 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాపై జరిగింది. 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవాలంటే ఇంకా 19.57 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. వారం రోజులు కష్టపడితే 4.43 కోట్ల షేర్ మాత్రమే తెచ్చుకున్న మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం అస్సలు ఇంపాజిబుల్ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే నితిన్ కెరియర్ లో మాచర్ల నియోజకవర్గం కంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ ఇంపాక్ట్ నితిన్ నెక్స్ట్ సినిమాలపై కూడా పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.