ఫేడౌట్ భామల ఐడియా ఎవరిదబ్బా!
ఇప్పటికే ఆ హీరోకి జోడీగా తీసుకొచ్చిన హీరోయిన్ కూడా చాలా సీనియర్. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఒకసారి ఫేడౌట్ అయితే మళ్లీ అవకాశం రావాలంటే అద్భుతాలు జరగాలి. అందులోనూ స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడం? అంటే అద్భుతాన్ని మించిన గొప్ప అద్భుతం ఏదైనా ఉంటే తప్ప సాద్యపడదు. తాజాగా ఓ ఇద్దరి భామల విషయంలో ఆ గొప్ప అద్భుతం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. అధికారికంగా విషయం కన్పమ్ అయితే ఆ భామల్ని మించిన లక్కీ గాళ్స్ ఎవరూ ఉండరనే చెప్పాలి. ప్రస్తుతం ఓ స్టార్ హీరోగా ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఆ హీరోకి జోడీగా తీసుకొచ్చిన హీరోయిన్ కూడా చాలా సీనియర్. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. వయసు పరంగా మ్యాచ్ అవుతుంది కాబట్టి అమె ఎంపిక తప్పని సరి అయింది కాబట్టి తప్పలేదు. కానీ ఇప్పుడు పనిగట్టుకుని మరీ ఫేడౌట్ అయిన ఇద్దరు హీరోయిన్ల సీన్ లోకి తేవడం ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు సినిమాలు చేసి చాలా కాలమవుతుంది. నిజానికి వాళ్లిద్దరు హైదరాబాద్ లో కూడా ఉండటం లేదు.
అవకాశాలు లేకపోవడంతో ఎప్పుడూ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఇతర భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం..వచ్చిన సినిమాలు చేయడం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ స్టార్ హీరో సినిమా కోసం పనిగట్టుకుని హైదరాబాద్ పిలిపిస్తున్నారు. మీరే ఆ రెండు పాత్రలు చేయాలి..మీరు మాత్రమే న్యాయం చేస్తారని బలంగా నమ్మి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే ఈ ఐడియా ఎవరిది? అన్నది ఆసక్తికరంగా మారింది. దర్శకుడి విజన్ కి తగ్గట్టు ఆయన ప్రకారం ఎంపిక జరుగుతుందా? లేక హీరోగారి ప్రోత్భలంతా ఎంపిక చేస్తున్నారా? అన్న సందేహం కూడా తెరపైకి వస్తోంది. ఎందుకంటే ఫేడౌట్ నటీనటులకు అవకాశం కల్పించడంలో ఈ మధ్య ఆ నటుడు బాగా చొరవ తీసుకుంటున్నారు. పోనీ లే పాపం ఓ అవకాశం ఇద్దామని చిన్న చూపుతో ఛాన్స్ కల్పిస్తున్నారు. కానీ అదే సినిమాకి మైనస్ గా మారుతుంది. తాజాగా ఫేడౌట్ భామల ఎంట్రీ కన్పమ్ అయితే కథ ఎలా అడ్డం తిరుగుతుందో చూడాలి.