ఫాహద్ ఫాజిల్ 'ఆవేశం' ఎలా ఉంది..?

సినిమా కథ రెగ్యులర్ గా అనిపించినా కూడా కథనంలో దర్శకుడు తన మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ యాక్షన్ ఇంప్రెస్ చేస్తుంది.

Update: 2024-04-18 06:18 GMT

మలయాళ విలక్షణ నటులల్లో ఫాహద్ ఫాజిల్ ఒకరు. తన సినిమాలతో సౌత్ ఆడియన్స్ ను మెప్పిస్తూ వచ్చిన ఫాహద్ తమిళ, తెలుగు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే మలయాళంలో మాత్రం సోలో ప్రయత్నాలతో అలరిస్తూ వస్తున్నాడు. ఫాహద్ ఫాజిల్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత సోలో లీడ్ గా చేసిన సినిమా ఆవేశం. టైటిల్ కు తగినట్టుగానే సినిమాలో ఆయన పాత్ర చాలా ఆవేశంగా కనిపిస్తుంది కానీ ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

జితు మాధవన్ డైరెక్షన్ లో వచ్చిన ఆవేశం సినిమా రీసెంట్ గా రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఇంతకీ ఈ ఆవేశం కథ ఏంటి..? ఆవేశం చూసిన ఆడియన్స్ రియాక్షన్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

ఆవేశం కథ విషయానికి వస్తే ఇది ఒక గ్యాంగ్ స్టర్ ఎంటర్టైనర్. చదువుకోవడానికి కాలేజీకి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు కాలేజీలో ర్యాగింగ్ ను భరించలేక ఒక గ్యాంగ్ స్టార్ ని సాయం అడుగుతారు. ఆ గ్యాంగ్ స్టర్ వారితో కలిసి కాలేజ్ లో వీరికి తిరుగు లేకుండా చేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ గ్యాంగ్ స్టర్ తో స్నేహం వల్ల ఈ కుర్రాళ్లు చిక్కుల్లో పడతారు. ఆ తర్వాత వాళ్లు ఏం చేశారన్నది సినిమా కథ. గ్యాంగ్ స్టర్ రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించగా ఆ ముగ్గురు కుర్రాళ్లు అజు, బీబీ, శాంతన్ పాత్రల్లో హిఫ్జ్ స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాజ్ నటించారు.

సినిమా కథ రెగ్యులర్ గా అనిపించినా కూడా కథనంలో దర్శకుడు తన మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ యాక్షన్ ఇంప్రెస్ చేస్తుంది. ఇదివరకు తనను చాలావరకు సీరియస్ పాత్రలో చూశాం. ఈ సినిమాలో అతను పూర్తిగా ఎంటర్టైనింగ్ గా కనిపిస్తాడు. గ్యాంగ్ స్టర్ పాత్రలో ఆవేశంగా కనిపించినా ఫాఫా యాక్టింగ్ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ ఫైట్స్ రంగా బ్యాచ్ తో ఆ ముగ్గురు స్నేహితులు కలవడం చూపించారు.

సెకండ్ హాఫ్ కాస్త థ్రిల్లర్ అంశాలతో ట్రాక్ తప్పించినా వర్క్ అవుట్ అయ్యింది. ఆవేశం కథ ఎంటర్టైనింగ్ వేలో చెప్పినా వెనక మదర్ సెంటిమెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ముగ్గురు కుర్రాళ్లు చేసే కామెడీ.. వారితో ఫాహద్ ఫాజిల్ తో వచ్చే సీన్స్ ఇవన్నీ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఫాహద్ ఫాజిల్ రంగా పాత్రలో చెలరేగిపోయాడని చెప్పొచ్చు.

ఈ సినిమా చూశాక ఫాహద్ ను రెగ్యులర్ సీరియస్ రోల్స్ మాత్రమే కాదు మిగతా పాత్రలకు అతన్ని ఎంపిక చేసుకుంటారు. సినిమాలో నటించిన మిగతా స్టార్ కాస్ట్ అంతా బాగా చేశారు.

మలయాళ సినిమాలు ఎప్పుడు వెరైటీ స్టోరీ టెల్లింగ్ తో రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు డిఫరెంట్ గా వస్తాయి. అయితే ఆవేశం సినిమా మలయాళంలో ఒక మాస్ మసాలా సినిమాగా చెప్పుకోవచ్చు. అందులో కూడా స్పెషల్ గా ఉండేలా దర్శకుడు ప్రయత్నించాడు. మొత్తానికి ఆవేశం స్టార్ గా ఆవేశం సినిమాతో ఫాహద్ ఫాజిల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం లో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News