ఏప్రిల్ 5 జాక్ పాట్ డేట్.. ఎందుకంటే..

అంతకంటే ఎక్కువగా సెలబ్రెటీలు పబ్లిక్ కి దగ్గరగా ఉంటూ రెగ్యులర్ గా వారి పేరు, సినిమా పేరు వినిపించేలా చేయాలి.

Update: 2024-01-24 05:00 GMT

సినిమా తెరకెక్కించడం ఒక ఎత్తయితే ప్రస్తుతం థియేటర్స్ లో కరెక్ట్ టైమ్ కి మూవీని రిలీజ్ చేసి, దానికి ఆడియన్స్ ని రప్పించడం మరో పెద్ద టాస్క్ గా మారింది. సాలిడ్ ప్రమోషన్స్ ఉంటే కానీ థియేటర్స్ కి వచ్చి ప్రేక్షకులు సినిమాలు చూసే పరిస్థితిలో లేరు. ఒక స్టార్ హీరోల చిత్రాలకి మాత్రమే ఓ మోస్తరుగా ప్రమోషన్స్ చేసిన మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మిగిలిన హీరోల మూవీస్ కి అయితే టీజర్ నుంచి మొదలై ట్రైలర్ వరకు ప్రతిదీ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి.

అంతకంటే ఎక్కువగా సెలబ్రెటీలు పబ్లిక్ కి దగ్గరగా ఉంటూ రెగ్యులర్ గా వారి పేరు, సినిమా పేరు వినిపించేలా చేయాలి. ఇవన్నీ చేస్తే మూవీకి కొంత వరకు ఓపెనింగ్స్ వస్తాయి. అదే సమయంలో రిలీజ్ డేట్ కూడా చాలా కీలకం అవుతుంది. రాంగ్ టైమింగ్ లో వచ్చి కమర్షియల్ గా ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. టాలీవుడ్ సినిమాలకి సంక్రాంతి సీజన్ చాలా బెస్ట్. అందుకే ఎవ్వరూ ఈ డేస్ ని వదులుకోవడానికి ఇష్టపడరు.

ఈ ఏడాదిలో అలాంటి డేట్స్ కొన్ని ఉన్నాయి. ఏప్రిల్ 5 కూడా రిలీజ్ కి బెస్ట్ డేట్ అవ్వనుంది. దీనికి కారణం 5,6,7 తేదీలలో వీకెండ్ ఉంటే ఏప్రిల్9న ఉగాది సెలవు వస్తోంది, నెక్స్ట్ ఏప్రిల్ 11న మరల ఈద్ ఫెస్టివల్ హాలిడే దొరుకుతుంది. 14 మళ్ళీ సండే, 17 శ్రీరామనవమి ఫెస్టివల్ కలిసి వస్తోంది. అంటే రెండు వారాల్లో ఏకంగా 3 సెలవులతో పాటు రెండు వీకెండ్స్ దొరుకుతున్నాయి.

నిజానికి ఏప్రిల్ 5న దేవర సినిమాని రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. అందుకే సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ డేట్ కి దిల్ రాజు "ఫ్యామిలీ స్టార్" మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. అలాగే "టిల్లు స్క్వేర్" కూడా మంచి డేట్ కోసం వెయిట్ చేస్తోంది.

ఈ రెండు సినిమాలపైన మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఏప్రిల్ 5న దేవర ప్లేస్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా ఇటు దిల్ రాజుకి, అటు నాగవంశీకి మంచి సాలిడ్ కలెక్షన్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఏప్రిల్ 16న ఏపీ, తెలంగాణలో ఎన్నికల సందడి ఉంటుంది. కాస్తా రిస్క్ చేస్తే మాత్రం కచ్చితంగా సినిమాలకి కలిసొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Tags:    

Similar News