ఫ్యామిలీ స్టార్.. హీరో కంటే అతడికే అసలైన అగ్నిపరీక్ష

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలిపారు పరశురామ్. ఎందుకంటే ఈ మూవీ విజయం ఆయనకు కీలకమనే చెప్పాలి.

Update: 2024-04-03 08:30 GMT

'అల్లు అర్జున్ పరుగు మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.. అప్పుడే దిల్ రాజు గారితో సినిమా చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం రావడం నా అదృష్టం. అందుకే ఈ ఛాన్స్ ను వేస్ట్ చేసుకోకుండా ప్రాణం పెట్టి పని చేశాను. ఈ సినిమా మీకు మంచి మెమోరీస్ ఇస్తుంది. సూపర్ హిట్ అవుతుంది'.. ఇవి నిన్న ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పెట్ల చేసిన వ్యాఖ్యలు.

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలిపారు పరశురామ్. ఎందుకంటే ఈ మూవీ విజయం ఆయనకు కీలకమనే చెప్పాలి. సర్కారు వారి పాట చిత్రం రిలీజ్ టైమ్ లో ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదని, ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని కామెంట్స్ వచ్చాయి. మహేష్ టైమ్ వేస్ట్ చేశారని కూడా కొందరు అన్నారు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని పరశురామ్ ట్రై చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుద్దని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు మంచి హిట్ అయ్యాయి.

ఈ సినిమా విజయం.. పరశురామ్ కథతోపాటు డైరెక్షన్ పై ఆధారపడి ఉంటుంది. ఈ మూవీ కోసం తన బెస్ట్ వర్క్ ను అందించాలి. ఇక ఈ చిత్రం రిజల్ట్ బట్టి ఆయనకు కొత్త అవకాశాలు వస్తాయి. సరైన హిట్ సాధించకపోతే తన నెక్స్ట్ సినిమా కోసం పెద్ద హీరో లేదా బ్యానర్ ను సంప్రదించడం కష్టమవుతుంది. కానీ ఫ్యామిలీ స్టార్ మంచి హిట్ అవుద్దని నమ్మకంతో ఉన్నారు పరశురామ్.

యంగ్ ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పరశురామ్. పలు సినిమాలకు స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2008లో యువ‌త మూవీతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువ తీసుకున్నా సరే.. చక్కటి చిత్రాలు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మరి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ఎలా అలరిస్తారో.. ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.

Tags:    

Similar News