ఫ్యామిలీ స్టార్.. మళ్ళీ ఈ ప్రయోగం వర్కౌట్ అయ్యేనా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Update: 2024-03-30 04:47 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకున్నాయి. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ మీద కూడా ఆడియన్స్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ చేస్తూ ఉండటంతో మరింత పాజిటివిటీ మూవీపైన ఉంది.

దానికి తగ్గట్లుగానే ఫ్యామిలీ స్టార్ సినిమాపై భారీగానే బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా రన్ టైం విషయంలో రౌడీ స్టార్ అభిమానులు కాస్తా టెన్షన్ పడుతున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ నిడివి 2 గంటల 40 నిమిషాలు అని తెలుస్తోంది. పరశురామ్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారువారిపాట మూవీ చేశారు. ఈ సినిమా రన్ టైం 2 గంటల 41 నిమిషాలు.

అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఈ సారి కూడా పరశురామ్ ఇంచుమించు అంతే నిడివితో ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు. సర్కారువారిపాట సినిమాకి ముందు అతని సినిమా ఏదీ కూడా 2 గంటల 30 నిమిషాల నిడివి దాటలేదు. ఆ సినిమాలు మినిమమ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో రన్ టైం పరంగా సర్కారువారిపాటని పరశురామ్ ఫాలో అయ్యారు.

మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మూవీపైన ఉన్న సానుకూలత ఆడియన్స్ ని మొదటి రోజు గట్టిగానే ధియేటర్స్ కి రప్పిస్తుంది. ఏ మాత్రం బాగుందనే టాక్ తెచ్చుకున్న కూడా సెలవులు కూడా కలిసొస్తున్నాయి కాబట్టి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉంది.

విజయ్ దేవరకొండకి కూడా ఇప్పుడు ఉన్నపళంగా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. టాక్సీవాలా తర్వాత సరైన హిట్ లేదు. లైగర్ తో డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది ఖుషితో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. అయితే ఫ్యామిలీ స్టార్ విషయంలో మాత్రం విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News