ఫ్యామిలీ స్టార్ లో... ఇన్ని బూతులా?
దాదాపు నాలుగు బూతు పదాలు ఉండడంతో సెన్సార్ వాటన్నిటికీ కూడా మ్యుట్ చెప్పడమే కాకుండా సబ్ టైటిల్స్ కూడా ఉండకూడదని చెప్పారు.
గీత గోవిందం సక్సెస్ తరువాత మరోసారి విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది అనగానే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందులోనూ దిల్ రాజు లాంటి ప్రొడక్షన్లో వీరి కాంబినేషన్ తెరపైకి వస్తూ ఉండడంతో కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విధంగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక మరోవైపు మృణాల్ ఠాగూర్ ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటించడం మరొక మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.
చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా ప్రమోషన్స్ లో చాలా ఎనర్జీతో పాజిటివ్ గా కనిపించారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెబుతూ వచ్చారు. ఇక ఇందులో ఫ్యామిలీ కథ మాత్రమే కాకుండా మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. సెన్సార్ పనులను కూడా ఇటీవల ఈ సినిమా పూర్తి చేసుకుంది.
163 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరపై కనిపించబోతోంది. అయితే ఇలాంటి ఫ్యామిలీ కథలలో సెన్సార్ యూనిట్ నుంచి అభ్యంతరాలు చెప్పే సన్నివేశాలు ఏమీ ఉండకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఇందులో దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో బూతులు వాడినట్లు తెలుస్తోంది. ఇక సెన్సార్ వాటిపై అభ్యంతరం చెప్పడంతో ఆ బూతు డైలాగ్స్ కు మ్యూట్ చేయడం జరిగింది.
ఊహించిన విధంగా అర్జున్ రెడ్డి లాంటి బూతు డైలాగ్ తో పాటు ఇంగ్లీషు బ్యాడ్ వర్డ్ F*** కూడా ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో వాడినట్లుగా తెలుస్తోంది. దాదాపు నాలుగు బూతు పదాలు ఉండడంతో సెన్సార్ వాటన్నిటికీ కూడా మ్యుట్ చెప్పడమే కాకుండా సబ్ టైటిల్స్ కూడా ఉండకూడదని చెప్పారు. ఇక మొదటి సాంగ్ లో మాత్రం లిక్కర్ కు సంబంధించి బాటిల్ ను సీజీతో బ్లర్ చేసే విధంగా సూచనలు ఇచ్చారు.
అసలు ఈ ఫ్యామిలీ కథలో ఇలాంటి బూతు డైలాగ్స్ ఉంటాయి అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సందర్భానుసారం కొన్ని సన్నివేశాలలో ఇలాంటి పదాలు ఉపయోగించి ఉండవచ్చు అనే కామెంట్స్ వస్తున్నాయి. కాని దిల్ రాజు సినిమాలలో అయితే అసలు ఇలాంటి పదాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వరు. అయితే ఫ్యామిలీ స్టార్ అంత బలమైన పదాలు ఎందుకు వాడవల్సి వచ్చింది అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
దర్శకుడు పరుశురామ్ చాలావరకు తన సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను చాలా చక్కగా హైలైట్ చేస్తాడు. రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా అందంగా ఉండేలా చూసుకుంటాడు కానీ ఎబ్బెట్టుగా అనిపించేలా చేయడు. మరి ఫ్యామిలీ స్టార్ కథలో 70% వరకు లవ్ స్టోరీ పాయింట్ తోనే కథ నడుస్తుంది అని దిల్ రాజు చెప్పారు. మరి ప్రేమ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఎలాంటి అనుభూతిని ఇస్తాయో చూడాలి.