సంక్రాంతికి రిలీజ్ సగం మాత్రమే పూర్తైన సినిమా..?
అయితే సినిమా రిలీజ్ కి కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఉన్నా సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉందని తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా ఇప్పటివరకు సగం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుందట.
విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. అయితే సినిమా రిలీజ్ కి కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఉన్నా సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉందని తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా ఇప్పటివరకు సగం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుందట. ఇంకా సగం దాకా షూట్ చేయాల్సి ఉందట. సంక్రాంతికి రిలీజ్ పెట్టుకుని ఇంకా షూటింగ్ పూర్తి అవ్వకపోవడంపై విజయ్ ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు.
త్వరలో చిత్ర యూనిట్ బ్యాంకాక్ లో ఒక లాంగ్ షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని తెలుస్తుంది. ఇక బ్యాంకాక్ నుంచి వచ్చాక చిన్న చిన్న ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తారట. నిర్మాత దిల్ రాజు సినిమా పూర్తి కాకుండానే సంక్రాంతికి ఖర్చీఫ్ వేసేసారు. అయితే పరశురాం ని తప్పనిసరిగా పూర్తి చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని చెబుతున్నారట.
విజయ్ దేవరకొండ కూడా ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేశాం కాబట్టి ఇప్పుడు వెనక్కి తగ్గొద్దని అనుకుంటున్నాడట. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఐరనే వంచాలా ఏంటి అంటూ ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ రౌడీ ఫ్యాన్స్ ని అలరించింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు.
ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్ మిస్సైతే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ లో డిజప్పాయింట్ ఉంటుంది. అందుకే రిలీజ్ డేట్ కి సినిమా పూర్తి చేయాలి లేదంటే హడావిడిగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకూడదు. మరి విజయ్ పరశురాం ఫ్యామిలీ స్టార్ అనుకున్నట్టుగా సంక్రాంతికి తెస్తారా లేదా అన్నది చూడాలి. ఖుషి తో విజయ్ కాస్త రిలాక్స్ గా అనిపించినా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆల్రెడీ గీతా గోవిందం తో ఈ కాంబో సూపర్ హిట్ కొట్టారు కాబట్టి ఫ్యామిలీ స్టార్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని నిలబెట్టూనేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.