గుంటూరు కారం : లాస్ట్ అంటూ ఫ్యాన్స్ హంగామా

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా అవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Update: 2024-01-05 05:32 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా అవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఈ సినిమాను మొదట్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. కానీ త్రివిక్రమ్‌ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలంటూ ముంబై వైపు చూస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ తెలుగులో మాత్రమే విడుదల చేయడం జరుగుతున్న విషయం తెల్సిందే.

అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడు. మహేష్ బాబు వద్దనుకున్నా కూడా అది పాన్ ఇండియా.. అంతకు మించి మూవీ అవుతుంది అనడంలో సందేహం లేదు. కనుక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత ఇకపై చేయబోయే అన్ని కూడా తెలుగుతో పార్టీ ఇతర భాషల్లో విడుదల అవ్వబోతున్నాయి.

కనుక ఇక ముందు పాన్ ఇండియా స్టార్ హీరో సూపర్ స్టార్ హీరో అంటూ మహేష్ బాబు ఆయన అభిమానులు పిలుచుకోబోతున్నారు. గుంటూరు కారం సినిమా మహేష్ బాబు కెరియర్ లో చివరి రీజనల్ మూవీ అవ్వబోతుంది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కొత్త ప్రచారానికి తెర తీశారు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రాజమౌళి సినిమాకు విజయ గర్వంతో మహేష్ బాబు రెడీ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News