RC16: ఓ టెన్షన్ తీరినట్లే..
గ్లోబల్ స్టార్ రామ్ ఫైనల్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ పూర్తి చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ ఫైనల్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ పూర్తి చేశారు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. అయితే శంకర్ వరుస ఫెయిల్యూర్స్ ఇప్పుడు మెగా అభిమానులని కలవరపెడుతున్నాయి. ఆయన అద్భుత మేకర్ అయిన కూడా కథల విషయంలో అప్డేట్ కాలేదనే మాట భారతీయుడు 2 తర్వాత వినిపిస్తోంది. వరుసగా స్నేహితుడా, ఐ, 2.0 తాజాగా భారతీయుడు 2 సినిమాలతో కమర్షియల్ ఫెయిల్యూర్స్ అందుకున్నారు.
భారతీయుడు 2 మూవీ స్క్రీన్ ప్లే పరంగా శంకర్ అందరిని నిరాశపరిచాడు. అందుకే గేమ్ చేంజర్ విషయంలో ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. మూవీ నుంచి వచ్చిన ఒక్క సాంగ్ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. మరో వైపు చరణ్ నెక్స్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ విషయంలో ఫ్యాన్స్ కి ఆందోళన లేకపోయిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాత్రం భయపెడుతున్నాడు.
ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఏ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. అలాగే గత కొనేళ్లుగా లోకల్ సినిమాలకి రెహమాన్ ప్రేక్షకులని మెప్పించే స్థాయిలో మ్యూజిక్ ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే వీటన్నింటికి రెహమాన్ రాయన్ మూవీతో ఫుల్ స్టాప్ పెట్టాడు. రాయన్ మూవీకి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ని రెహమాన్ అందించారు. రాయన్ సక్సెస్ లో ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి.
రాయన్ మూవీ చూసిన తర్వాత రామ్ చరణ్ చేయబోయే RC16 సినిమా విషయంలో ఫ్యాన్స్ కి టెన్షన్ పోయింది. బుచ్చిబాబు అద్భుతమైన కథని పీరియాడిక్ జోనర్ లో చెప్పబోతున్నాడని బలంగా నమ్ముతున్నారు. అతను ఏరికోరి ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అంటే ఈ కథకి రెహమాన్ కరెక్ట్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించగలడని బుచ్చిబాబు నమ్మాడని అర్ధమవుతోంది. ఇప్పుడు రాయన్ మూవీ కూడా మాస్ అండ్ కల్ట్ కంటెంట్ తో తెరకెక్కింది.
రామ్ చరణ్ సినిమా కూడా ఇంచుమించు ఇదే ఫ్లేవర్ తో ఉత్తరాంధ్ర నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో ఉండబోతోంది. అందుకే ఏఆర్ రెహమాన్ RC16కి కూడా బెస్ట్ మ్యూజిక్ అందిస్తాడని మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు నమ్ముతున్నారు. టాలీవుడ్ లో ఆయన పేరు మీద ఉన్న ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డ్ కి RC16తో బ్రేక్ పడుతుందని అంచనా వేస్తున్నారు.