ఆ యువ హీరోకి తండ్రి బ్యాకప్ ఇవ్వలేకపోతున్నాడా?
ఇక ఆ నటుడు తండ్రి కూడా తనయుడు కోసం ఎలాంటి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు.
ఒకప్పడు ఫ్యామిలీ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నటుడు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్నింగ్ తీసుకున్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్ విషయంలో కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు. ఇంకొన్నాళ్ల పాటు తన ఛరిష్మాతో అవకాశాలు అందుకుంటాడు. ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం. ఎంతో మంది దర్శక-నిర్మాతలతో పరిచయాలు. తాను చెబితే వినేవారు లేకపోలేదు.
ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలతోనూ మంచి రిలేషన్ షిప్ కలిగి ఉన్నాడు. కానీ ఈ పరిచయాలు.. అనుభ వాలు కేవలం తనకి తప్ప! తనయుడికి మాత్రం ఉపయుక్తంగా కనిపించడం లేదు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆ కుర్రాడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ఓ సినిమాతో హీరోగానూ లాంచ్ అయ్యాడు. హీరో కటౌట్... అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఆ యువ నటుడ్ని మేకర్స్ సరిగ్గా వినియోగించు కోల్గితే వండర్స్ చేయోచ్చు అన్నది విశ్లేషకుల మాట. కానీ ఆ యువ హీరో ప్రయాణం ఆ విధంగా సాగుతు న్నట్లు కనిపించలేదు. అవకాశం వస్తే చేద్దాం లేకపోతే ఖాళీగా ఉందాం అన్నట్లే కనిపిస్తుంది. వ్యక్తిగతంగా తనకు తానుగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు. అలా చేస్తే కనీసం నెట్టింట ప్రచారమైనా సాగేది.
ఆ గాలి వార్తల కారణంగానైన దర్శక-రచయితల దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. ఇక్కడా ఆ రకమైన అవకాశం కూడా లేదు. ఇక ఆ నటుడు తండ్రి కూడా తనయుడు కోసం ఎలాంటి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు. తనకున్న పరిచయాల్ని తండ్రి మాట సహకారం రూపంలో కూడా చేయలే కపోతున్నాడనే విమర్శ వినిపిస్తుంది. అయితే సినిమా వాతావరణం బాగా తెలిసిన ఆ తండ్రి ఇండస్ట్రీ లో ఎవరికి వారు ఎదగాలి తప్ప! ఒకరు చెబితే అవకాశం ఇవ్వడం అన్నది జరిగే పని కాదన్న మాటని బలంగా నమ్ముతారు. ఆ యువ హీరో ఇండస్ట్రీకి రాకముందే ఆ తండ్రి ఆ విధంగా వ్యాఖ్యానించడం అన్నది గుర్తించాల్సిన అంశమే. మరి ఈ పరిస్థితులన్నింటినీ దాటుకు యువ హీరో ముందుకు సాగుతాడా? లేదా? అన్నది చూడాలి.