నీ ఆలోచనల్లో మునిగిపోయి చనిపోతున్నాను!
విజయ్ ఆంటోని భార్య ఫాతిమా మరణించిన తన బిడ్డను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. మీరా ఫోటోని కూడా షేర్ చేసింది.
నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా కొన్ని వారాల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి విధితమే. 16 ఏళ్ల చిన్నారి దురదృష్టకర మరణం అతడి హృదయాన్ని ఛిద్రం చేసింది. నీతోనే నేనూ మరణించాను! అంటూ విజయ్ ఆంటోని ఇంతకుముందు హృదయవిదారకమైన నోట్ రాసారు. ఇప్పుడు విజయ్ ఆంటోని భార్య ఫాతిమా ఆంటోని హృదయాన్ని కదిలించే నోట్ అందరినీ కదిలిస్తోంది. ఒక తల్లి గుండె లోతుల్లోని ఆవేదన కన్నీళ్లు పెట్టిస్తోంది.
విజయ్ ఆంటోని భార్య ఫాతిమా మరణించిన తన బిడ్డను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. మీరా ఫోటోని కూడా షేర్ చేసింది. ''నువ్వు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే, నేను నిన్ను నాకు చాలా దగ్గరగా ఉంచుకునేదానిని. నిన్ను సూర్యచంద్రులకు కూడా చూపించకుండా దాచేసేదానిని. నేను నీ లోచనల్లో మునిగిపోయి చనిపోతున్నాను. నువ్వు లేకుండా బ్రతకలేను.. మీ అమ్మనాన్నల దగ్గరకు తిరిగి వచ్చేయ్.. నీ చెల్లి లారా నీ కోసం ఎదురుచూస్తూనే ఉంది..లవ్ యు తంగం'' అంటూ ఆవేదనతో కూడిన నోట్ ని రాసారు.
ఫాతిమా విజయ్ ఆంటోనీ బాధ ఎవరూ తీర్చలేనిది. అభిమానులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని పాతిమను కోరుతున్నారు. విజయ్ ఆంటోనీ ఇంతకుముందు తన కుమార్తె మీరా మరణంపై ప్రెస్ నోట్ ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశాడు. విజయ్ ఉద్వేగభరితమైన మాటలు అభిమానులకు తనలోని బాధను ఆవిష్కరించాయి.
ఇప్పుడు ఫాతిమా విజయ్ ఆంటోని సందేశం అభిమానుల హృదయాలను కలచివేసింది. సెప్టెంబరు 19న మీరా విజయ్ ఆంటోనీ తన ఇంటి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఆపై చిన్నారి మీరా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ప్రకటించారు. మీరా ఆత్మహత్యపై పోలీసులు తమదైన కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. విజయ్ ఆంటోనీ నటించిన 'రథం' ఇటీవలే విడుదలైంది. దీనికి CS అముధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది. కానీ 'రథం' బాక్సాఫీస్ కలెక్షన్లు పేలవంగా కనిపించడంతో విజయ్ ఆంటోని అభిమానులు నిరాశపడ్డారు.