'ఫైటర్'.. ఆ రేంజ్ ఓపెనింగ్స్ కష్టమే?

ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.

Update: 2024-01-23 14:45 GMT

బాలీవుడ్ డైరెక్టర్, వార్ మూవీ ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'. బ్యాంగ్ బ్యాంగ్, వార్, వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ - హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో 'ఫైటర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.

సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ ని రాబట్టలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సైతం పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఇక సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. రిపబ్లిక్ డే వీకెండ్ కలిసొస్తుందని ఒక్కరోజు ముందు గురువారమే రిలీజ్ చేస్తున్నారు.

గురువారం రిలీజ్ చేస్తే మరునాడు రిపబ్లిక్ డే హాలిడే కావడం, ఆ తర్వాత వీకెండ్ వస్తుండడంతో సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయని మూవీ టీం అలా ప్లాన్ చేశారు. కానీ తీరా చూస్తే ఫైటర్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మూవీ టీం సినిమాకి ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేసిందిమ్ కానీ అలా జరగలేదు. ఈ సినిమాని సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించారు.

కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దాంతో ఫైటర్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకోవడం కష్టమే అని చెబుతున్నారు. ఈ సినిమా డే వన్ కనీసం 30 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేయడం కూడా గగనమే అని క్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదే సిద్ధార్థ్ ఆనంద్ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన 'వార్' మూవీ అప్పట్లో డే వన్ 50 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకని రికార్డ్ క్రియేట్ చేసిందిమ్ కానీ ఇదే కాంబినేషన్లో రాబోతున్న 'ఫైటర్' మూవీ మాత్రం అందులో సగం కలెక్షన్స్ అయినా రాబడుతుందో లేదో? ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ బాగుంటే రెండో రోజు నుంచి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News