పబ్లిక్ ఈవెంట్లో భుజంపై చెయ్యేసి హీరోయిన్‌కి ముద్దు!
చివరికి రాజ్ తరుణ్ సరసన 'తిరగబడర సామి' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల మన్నారా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది
ప్రియాంక చోప్రా కజిన్ గా మన్నారా చోప్రా సుపరిచితురాలు. కానీ రికమండేషన్లు ఇక్కడ పని చేయవు. ప్రతిభ అందచందాల ఆధారంగానే అవకాశాలు దక్కుతాయి. ఆ కోవలో చూస్తే చాలా కాలంగా టాలీవుడ్ ని అంటిపెట్టుకుని ఉంది మన్నారా చోప్రా. కెరీర్ కోసం ఇప్పటికీ పాకులాడుతూనే ఉంది. కానీ ఆశించిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగు సినీపరిశ్రమతో పాటు తమిళంలోనూ లక్ చెక్ చేసుకున్నా అక్కడా కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు.
ఇటీవల మన్నారా సోషల్ మీడియా ఫోటోషూట్లలో, ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో ఆర్థికంగా చాలా క్రైసిస్ లోకి వెళ్లిపోయానని చెప్పిన ఈ బ్యూటీ అవకాశాల కోసం చాలా హార్డ్ గానే ట్రై చేస్తోంది. సెకండ్ వేవ్ లో కరోనా సోకడంతో ముంబైలోని ఒక వైద్యుడి వద్ద చికిత్స తీసుకుని కోలుకుంది. తర్వాత 'హేల్ దిల్' అనే షార్ట్ ఫిలింలో నటించింది. కానీ పెద్ద తెర అవకాశాలైతే రాలేదు.
చివరికి రాజ్ తరుణ్ సరసన 'తిరగబడర సామి' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల మన్నారా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజా ప్రమోషనల్ ఈవెంట్లో మన్నారా చోప్రా భుజంపై చెయ్యేసి దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ బుగ్గపై ముద్దు ఇచ్చాడు. అయితే పబ్లిక్ ఈవెంట్లో అతడి నిర్వాకంపై చాలామంది సీరియస్ అవుతున్నారు. ఒక దర్శకుడు హీరోయిన్ తో పబ్లిక్ లో ఇలా ప్రవర్తిస్తాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఎంత క్యూట్ గా ఉన్నా ప్రజల ముందు ఏమిటిలా? అంటూ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ క్షణం ఎగ్జయిట్ మెంట్ లో అతడు ఒక పెక్ మాత్రమే ఇచ్చాడని సర్ధి చెప్పేవాళ్లు ఉన్నారు. మొత్తానికి ముద్దు బొమ్మ బుగ్గపై ఆ ఘాటు ముద్దు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.