ఇండియాలోనే ఫాస్టెస్ట్ డైరెక్టర్స్!
అంతకు మించి ఎక్కువ రోజుల షూటింగ్ అన్నది వాళ్ల డిక్షనరీలో చాలా రేర్ గా కనిపిస్తుంది. వీళ్లిద్దరూ సెట్స్ కి వెళ్లే ముందే చాలా క్లారిటీ తో ఉంటారుట
స్టార్ హీరోలెవరైనా ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే అతి కష్టం మీద జరుగుతోంది. దీనికి కారణం హీరో కారణమా? దర్శకుడు కారణమా? అన్నది సరైన క్లారిటీ లేదు. హీరో దర్శకుడికి అనుకూలంగా డేట్లు కేటాయిస్తే ఎందుకు పూర్తి చేయలేరు అన్నది కొంత మంది మేకర్స్ వాదన. ఇంకొంత మంది హీరోలు ఆ బాధ్యత దర్శకుల మీద వేస్తారు. సెట్ లో ప్రాపర్ గా లేకపోవడం వల్ల డిలే అవుతుందని...నిర్మాత తటపటాయింపులు వంటివి కారణాలుగా కనిపిస్తుంటాయి.
ఇలా ఎన్ని కారణాలు తెరపైకి తెచ్చినా ఏడాదికి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఇలాంటి కారణాలతో సంబంధం లేకుండా అత్యంత వేగంగా సినిమా షూటింగ్ లు పూర్తి చేయగల దర్శకుల్లో వాళ్లిద్దరే ఇండియాలో నెంబర్ వన్ అని చెప్పొచ్చు. వాళ్లే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్...కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ విషయంలో ఇద్దరి మధ్య మంచి పోటీ ఉందని చెప్పొచ్చు. వీళ్లు షూటింగ్ కోసం మహా ఎక్కువ అయితే మూడు నెలలు సమయం తీసుకుంటారు.
అంతకు మించి ఎక్కువ రోజుల షూటింగ్ అన్నది వాళ్ల డిక్షనరీలో చాలా రేర్ గా కనిపిస్తుంది. వీళ్లిద్దరూ సెట్స్ కి వెళ్లే ముందే చాలా క్లారిటీ తో ఉంటారుట. ఎలాంటి కన్ ప్యూజన్ లేకుండా ఏ రోజుకి ఎంత షూటింగ్ పూర్తి చేయాలన్నది బ్రెయిన్ లో ఫిక్స్ అయి ఉంటుందిట. ఆ రోజు ఆ పని పూర్తయ్యే వరకూ యూనిట్ ని పరుగులు పెట్టించి మరీ పనిచేయించుకుంటారుట. వీళ్లిద్దరిలో ఏ మేకర్ కూడా పని చేయించుకోలేరని..సెట్ లో కట్రోలింగ్ గానీ ప్రతీది చాలా ప్రోపర్ గా ఉంటుందిట.
సెట్ లో కొన్ని రకాల వెసులు బాట్లు లేకపోయినప్పటికీ ఉన్న వనరుల్ని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన దర్శకులు అని ఓ సీనియర్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. పాన్ ఇండియాని షేక్ చేసిన రాజమౌళి సైతం పూరి వర్క్ స్టైల్ కి ఫిదా అయినవారే. అందుకే పూరికి అసిస్టెంట్ రెండు రోజులైనా చేయాలని అందరి ముందు చెప్పగలిగారు. జక్కన్న నోట అంతటి మాట వచ్చిందంటే పూరి అసాధ్యుడనేగా.