మన్సూర్ అలీ ఖాన్ పై ఎఫ్ఐఆర్..!
విషయం పెద్దది అవుతున్న కారణంగా మన్సూర్ అలీ ఖాన్ పై చెన్నై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేశారు.
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిష పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమాలో త్రిషతో కలిసి ఒక్క సీన్ అయినా బెడ్ రూమ్ సీన్ ఉంటాయని అనుకున్నా.. ఇదివరకు సినిమాలలానే ఈ సినిమాలో కూడా త్రిషతో అలాంటి సీన్స్ ఉంటాయని అనుకున్నా కానీ అలా జరగలేదని అన్నారు. ఇదివరకు తాను రేప్ సీన్లలో నటించాను. రేప్ సీన్లు తనకు కొత్తేమి కాదని అన్నారు. లియో షూటింగ్ కశ్మీర్ లో జరుగుతున్నప్పుడు త్రిషని కనీసం తనకు చూపించలేదని మన్సూర్ కామెంట్స్ చేశారు.
దీనిపై త్రిష కూడా ఎంతో ఘాటుగా స్పందించారు.. మన్సూర్ తన గురించి నీచంగా మాట్లాడిన వీడియో చూశాను. ఇది లైంగికంగా, స్త్రీ ద్వేశపూరితంగా.. అసహ్యకరంగా ఉందని అన్నారు. ఇలాంటి మనుషుల వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుందని త్రిష స్పందించారు. ఈ క్రమంలో మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన కామెంట్స్ కు సినీ ప్రముఖులు కూడా ఖండించారు.
వివాదం ముదురుతున్నా సరే మన్సూర్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు తప్ప క్షమాపణ చెప్పలేదు. మన్సూర్ అలీ ఖాన్ మంగళవారం చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి. తనపై తాత్కాలిక నిషేధం విధించి నడిగర్ సంఘం పెద్ద తప్పు చేసిందని అన్నారు. కనీస వివరణ కోరకుండా ఇలా నిషేధం ఎలా విధిస్తారంటూ నేను ఏం తప్పు మాట్లాడలేదు.. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని అన్నారు. ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పలేనని అన్నారు మన్సూర్ అలీ ఖాన్.
నడిగర్ సంఘానికే నాలుగు గంటలు టైం ఇస్తున్నా.. తనపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని వార్నింగ్ ఇచ్చారు మన్సూర్ అలీ ఖాన్. విషయం పెద్దది అవుతున్న కారణంగా మన్సూర్ అలీ ఖాన్ పై చెన్నై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేశారు. చెన్నైలోని థౌజంట్ లైట్స్ ప్రాంతంలో గల మహిళా పోలీస్ స్టేషన్ లో మన్సూర్ పై లైంగిక వేధింపులతో పాటుగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాతీయ మహిళా కమీషన్ ఫిర్యాదు మేరకు మన్సూర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై మన్సూర్ వెనక్కి తగ్గక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తను అన్న మాటలను సమర్ధించుకుంటూ విషయాన్ని ఇంకా పెద్దది చేసుకుంటున్నారు మన్సూర్ అలీ ఖాన్.