ఫస్ట్ దీపావళి విత్ మై క్రాకర్.. పారీపై రాఘ‌వ్ ప్రేమ‌!

ప‌రిణీతి ధ‌గ‌ధ‌గా మెరిసే మెరూన్ చీరను ధరించగా, రాఘవ గోధుమ రంగు కుర్తా-పైజామాలో అందంగా కనిపించాడు.

Update: 2023-11-13 15:21 GMT

అందాల క‌థానాయిక పరిణీతి చోప్రా పెళ్లి తర్వాత మొదటి దీపావళిని ఘ‌నంగా జరుపుకుంది. హబ్బీ రాఘవ్ చద్దా పారీని ఫైర్‌క్రాకర్ అని పిలుస్తూ ఆట‌ప‌ట్టించాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పరిణీతి దీపావ‌ళి వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోలలో కొత్తగా పెళ్లైన జంట మ‌ధ్య రొమాన్స్ ఒక రేంజులో కుదిరింది. ఈ అంద‌మైన జంట‌ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటూ చిరునవ్వుతో క‌నిపించారు. ప‌రిణీతి ధ‌గ‌ధ‌గా మెరిసే మెరూన్ చీరను ధరించగా, రాఘవ గోధుమ రంగు కుర్తా-పైజామాలో అందంగా కనిపించాడు.


ఫోటోలను షేర్ చేసిన పరిణీతి `నా ఇల్లు` అని ఎమోష‌న‌ల్ అయింది. ఈ పోస్ట్ కి దీపావ‌ళి లైట్నింగ్ ఈమోజీల‌ను జోడించింది. ఇదిలా ఉండగా రాఘవ్ చద్దా `ఫస్ట్ దీపావళి విత్ మై క్రాకర్` అని రాశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24న పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ముందు జరిగే వేడుకలు ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్‌తో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సూఫీ నైట్ - అర్దాస్ వేడుక జరిగింది. అటుపై ఈ జంట ఉదయపూర్‌కు వెళ్లారు. అక్కడ హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. అనంతరం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి ప్ర‌మాణాలు చేసారు.


వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన‌ పరిణీతి ఎంతో ఆనందంగా క‌నిపించారు. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద మొదటి చాట్ నుండి.. మా హృదయాలకు తెలుసు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నామ‌ని.. ఎట్టకేలకు మిస్టర్ అండ్ మిసెస్ కావడం ఆశీర్వాదం! ఒకరికోసం ఒక‌రం లేకుండా బ్రతకలేం.. అని వ్యాఖ్య‌ను షేర్ చేసారు. అనంతరం దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేసి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మేము కలిసి ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, మీరందరూ మా పక్షాన నిలబడి ఉన్నారని తెలుసుకున్నామ‌ని పారీ ఎంతో ఎమోష‌న‌ల్ అయింది. మీ ప్రేమ ఆశీర్వాదాలు నిజంగా వెలకట్టలేనివి.. మేము ఇంతకంటే కృతజ్ఞతతో ఉండలేము అని ఇన్ స్టాలో రాసింది. అప్పుడే భార్య‌ను క్రాక‌ర్ అని పిలిచేశాడేంటీ? అంటూ నెటిజ‌నులు స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News