అక్కినేని వారి కోసం 47 ఏళ్లుగా...!

రామాచారి గురించి అక్కినేని నాగార్జున మరియు స్టూడియో నిర్వాహకురాలు సుప్రియ లు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్టూడియో కోసం ఎంతగా కష్టపడుతారో వీడియో లో చూపించారు.

Update: 2023-10-26 10:38 GMT

తెలుగు సినిమా అనగానే గుర్తుకు వచ్చే పేర్లు మరియు ప్రదేశాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌ కి రావడం లో కీలక పాత్ర పోషించింది అన్నపూర్ణ స్టూడియోస్ అంటారు. అలాంటి అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో సంస్థ నిర్వాహకులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.

హీరోస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో సుదీర్ఘ కాలంగా స్టూడియో కోసం పని చేస్తున్న కార్మికులు మరియు అన్ని వర్గాల ఉద్యోగుల గురించి డాక్యుమెంటరీ టైప్ లో వీడియోలను విడుదల చేస్తున్నారు. వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ కి చెందిన అకౌంటెంట్‌ రామాచారి గురించి వీడియోను విడుదల చేశారు.

అన్నపూర్ణ స్టూడియో పునాది రాయి వేసినప్పటి నుంచి కూడా రామాచారి అకౌంటెంట్‌ గా పని చేస్తున్నారట. నాగేశ్వరరావు నమ్మిన వ్యక్తిగా ఆయన స్టూడియో యొక్క ఆర్థిక లావాదేవీలను చూసుకునేవారు. కాగితాల నుంచి అకౌంట్స్‌ కంప్యూటర్ లోకి వచ్చినా కూడా ఆయన్నే స్టూడియో యాజమాన్యం అకౌంటెంట్‌ గా కొనసాగిస్తూ వస్తోంది.

రామాచారి గురించి అక్కినేని నాగార్జున మరియు స్టూడియో నిర్వాహకురాలు సుప్రియ లు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్టూడియో కోసం ఎంతగా కష్టపడుతారో వీడియో లో చూపించారు. ఆయన కూడా తనకు అక్కినేని కుటుంబం చాలా సహాయం చేసిందని కృతజ్ఞతను చూపించాడు.

నాగార్జున మాట్లాడుతూ అక్కినేని వారి డబ్బు, అన్నపూర్ణ స్టూడియోస్ కి చెందిన డబ్బు అంతా కూడా ఒక బీరువాలో వేసి ఆ బీరువా తాలాలను ఆయన చేతిలో పెట్టేంత నమ్మకస్తుడు రామాచారి. ఆయన మా సంస్థ యొక్క ఉద్యోగి అనడం కంటే మా ఫ్యామిలీ మెంబర్‌ అనడం కరెక్ట్‌ అన్నట్లుగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రామాచారి వంటి ఎంతో మంది కష్టపడి పని చేయడం వల్లే నేడు అన్నపూర్ణ స్టూడియోస్ ఈ స్థాయిలో ఉంది.

Full View
Tags:    

Similar News