పుష్ప 2 లీక్… కావాలనే చేశారా?

ఇప్పట్లో ఎవ్వరు కూడా 'పుష్ప 2' కలెక్షన్స్ ని అందుకోలేకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Update: 2024-12-21 21:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 1600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వైపు వడివడిగా పరుగులు పెడుతోంది. తగ్గేది లే అంటూ ప్రేక్షకులు ఈ సినిమాపై కాసులవర్షం కురిపిస్తున్నారు. హిందీలో అయితే 650 కోట్లకి దగ్గరగా ఈ మూవీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పట్లో ఎవ్వరు కూడా 'పుష్ప 2' కలెక్షన్స్ ని అందుకోలేకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఇదిలా ఉంటే 'పుష్ప 2' మూవీ సక్సెస్ కావడంతో నెక్స్ట్ పార్ట్ అయిన 'పుష్ప 3' ర్యాంపేజ్ కూడా వేగంగా తెరకెక్కిస్తే బెటర్ అనే మాట వినిపిస్తోంది. అయితే సుకుమార్, అల్లు అర్జున్ నిర్ణయం బట్టి ఈ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడనేది క్లారిటీ వస్తుంది.. పుష్ప ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ సినిమా ఎప్పుడు వచ్చిన 2000 కోట్ల కలెక్షన్స్ గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. 'బాహుబలి 2', 'దంగల్' మూవీ 'పుష్ప 2' కంటే ముందు స్థానంలో ఉన్నాయి. 'బాహుబలి 2'కి జపాన్, చైనాలో భాషలలో మంచి వసూళ్లు వచ్చాయి. అలాగే 'దంగల్' కూడా చైనా భాషలో భారీ కలెక్షన్స్ రాబట్టింది.

అందుకే ఆ రెండు టాప్ లో నిలిచాయి. 'పుష్ప 2' కూడా జపాన్, చైనా భాషలలో రిలీజ్ చేస్తే దంగల్ రికార్డ్ బ్రేక్ అవుతుందనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే మధ్యకాలంలో సినిమాలకి పైరసీ భూతం చాలా ప్రమాదకరంగా తయారైన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2 మూవీ HD ప్రింట్ తాజాగా టెలిగ్రామ్ యాప్ లోకి వచ్చేసిందని తెలుస్తోంది. ఆన్ లైన్ లో కూడా పెట్టేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

థియేటర్ ప్రింట్ అయితే సినిమా కలెక్షన్స్ కి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ హెచ్ డీ ప్రింట్ అంటే కచ్చితంగా చాలా మంది డౌన్ లోడ్ చేసేసుకుంటారు. ఇది సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఇంకా 16 రోజులే అయ్యింది. థియేటర్స్ లో డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. మేకర్స్ కూడా భారీ కలెక్షన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఈ మూవీ లీక్ అనేది మేకర్స్ ని కలవరపెడుతుంది. దీనిని ఆన్ లైన్ లోనుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది 'పుష్ప 2'కి భారీ కలెక్షన్స్ వస్తోన్న నేపథ్యంలో దానిని తట్టుకోలేక ఎవరో ఈ పైరసీకి పాల్పడి ఉంటారని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంక్వయిరీ చేస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. ఏది ఏమైనా భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకి ఈ పైరసీ పెను ప్రమాదంగా మారింది. దీనిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News