మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య... తెరపైకి కీలక విషయాలు!

మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ (38) ఫిబ్రవరి 13న బిన్నింగెన్ లోని తన నివాసంలో దారుణ స్థితిలో మృతి చెందింది.

Update: 2024-09-13 04:18 GMT

మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ (38) ఫిబ్రవరి 13న బిన్నింగెన్ లోని తన నివాసంలో దారుణ స్థితిలో మృతి చెందింది. ఈ సమయంలో ఆమె కాబడిన విధానంలో పలు దారుణ విషయాలు తెరపైకి వచ్చాయి. ఆమెను అత్యంత కిరాతకంగా భర్త థామస్ (41) చంపినట్లుగా న్యాయస్థానం తేల్చింది.

అవును... క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసిన తర్వాత.. ముక్కలు ముక్కలుగా చేసి రసాయనాలతో కరిగించినట్లు చెబుతున్నారు. అయితే ఆత్మ రక్షణ కోసమే ఈ హత్య చేసినట్లు థామస్ చెబుతున్నప్పటీ.. దాన్ని బలపరిచే విషయం ఏదీ గుర్తించబడలేదని తెలుస్తోంది!

కాగా... క్రిస్టినా – థామస్ లు 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు! ఈ క్రమంలో హత్యకు గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు కానీ... లాండ్రీ గదిలో ఒక కత్తి, జా, గార్డెన్ షియర్స్ ఉపయోగించి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు.

ఈ క్రమంలో బాధితురాలి మృతదేహం దొరికిన మరుసటి రోజే థామస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ముక్కలు చేసి రసాయనాలతో దహనం చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేనట్లుగా దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఇక.. 2007 మిస్ స్విట్జర్లాండ్ పోటీలో క్రిస్టినా ఫైనలిస్ట్ గా నిలిచారు.

Tags:    

Similar News