గామి ట్రీట్.. అక్కడ మరోలా..!

ఈ మధ్యకాలంలో సినిమాలకి సంబందించిన థియేటర్ కాపీ, డిజిటల్ కాపీ అని రెండు రెడీ చేస్తున్నారు

Update: 2024-03-12 15:46 GMT

ఈ మధ్యకాలంలో సినిమాలకి సంబందించిన థియేటర్ కాపీ, డిజిటల్ కాపీ అని రెండు రెడీ చేస్తున్నారు. థియేటర్స్ లో ఆడియన్స్ మేగ్జిమమ్ 2 నుంచి 2:30 గంటలు మాత్రమే ఎంగేజ్ అయ్యే అవకాశం ఉంటుందని భావించి ఫైనల్ అవుట్ ఫుట్ నుంచి అవసరం లేని సన్నివేశాలని కట్ చేస్తున్నారు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసరికి కట్ చేసిన సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఓటీటీలో ఆడియన్స్ ఇంట్లో కూర్చొని చూస్తారు కాబట్టి ఎక్కువగా ఎంగేజ్ అవుతారని భావిస్తూ ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. అందుకే కొన్ని సినిమాలు థియేటర్స్ లో చూసినపుడు లేని సన్నివేశాలు ఓటీటీలో చూసినపుడు ఉంటున్నాయి. విశ్వక్ సేన్ గామి మూవీ విషయంలో ఇదే థియరీని చిత్ర యూనిట్ ఫాలో అవుతుందంట. మూవీ ఫైనల్ అవుట్ ఏకంగా 165 నిమిషాల నిడివి వచ్చిందంట.

అయితే థియేటర్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలు కట్ చేశారంట. అంటే 148 నిమిషాల నిడివితోనే థియేటర్ లో మూవీ రిలీజ్ చేశారు. అయితే ఓటీటీలో రిలీజ్ చేసే సమయంలో కట్ చేసిన 17 నిమిషాల ఎపిసోడ్స్ ని మళ్ళీ యాడ్ చేయనున్నారంట. అదనపు ఎమోషన్స్, ఫీల్ ని ఆడియన్స్ కి అందించే ఉద్దేశ్యంతో ఇలా ఓటీటీకి యాడ్ వెర్షన్ ని అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్ టాక్ దిశగా దూసుకుపోతోంది. విశ్వక్ సేన్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.7 కోట్ల గ్రాస్ ని గామి మూవీ వసూళ్లు చేసింది. రెండో రోజు 6.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నాలుగు రోజుల్లో 22 కోట్లకి పైగా వసూళ్లని గామి మూవీ కలెక్ట్ చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

హాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రెజెంటేషన్, ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్, విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ సినిమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కంటెంట్ కాస్తా అడ్వాన్స్ మోడ్ లోనే ఉన్న సామాన్య జనాలకి అర్ధమయ్యే విధంగా దర్శకుడు విద్యాధర్ నేరేట్ చేయడంతోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా విశ్వక్ అఘోరా పాత్రలో నటించిన విధానం ఆడియెన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే అతికొద్ది మంది హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరని మరోసారి రుజువైంది. ఇక ఈ సినిమా ఈ వారం చివరి వరకు కూడా సాలీడ్ కలెక్షన్లు అందుకునే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News