ఆ మాటలు గుడ్డిగా నమ్మడం వల్లే 'గామి' వచ్చింది

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా విద్యాధర్‌ దర్శకత్వంలో రూపొందిన గామి సినిమా రేపు మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

Update: 2024-03-07 04:55 GMT

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా విద్యాధర్‌ దర్శకత్వంలో రూపొందిన గామి సినిమా రేపు మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాందిని చౌదరి హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాను హిమాలయాలు, కశ్మీర్‌ ఇలా అత్యంత కఠినమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ట్రైలర్‌ లోని విజువల్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.

తాజాగా గామి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వైభవంగా జరిగింది. అడవి శేష్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుకలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సినిమా కోసం తాము పడ్డ కష్టం, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.

ఇంకా విశ్వక్‌ సేన్ మాట్లాడుతూ... పిలవగానే వచ్చిన అడవి శేష్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇతరులకు పెద్ద థాంక్స్‌. నా టీం అందరికీ కృతజ్ఞతలు. నా జీవితం మొత్తంలో ఒక మనిషి మాటను గుడ్డిగా నమ్మింది ఒక్కసారి మాత్రమే. ఆ మనిషి మాటలను గుడ్డిగా నమ్మినాను. ఆ మనిషి మాటలో ఉన్న నిజాయితీని నమ్మినాను. అలా గుడ్డిగా నమ్మడం వల్లే నా జీవితంలో ఈ రోజు 'గామి' ఉంది.

ఆ మనిషే దర్శకుడు విద్యాధర్‌. ఇప్పటి వరకు నా జీవితంలో ఎంతో మంది మంచి వారిని చూశాను.. డబ్బు ఉన్న వారిని, డబ్బు లేని వారిని, డబ్బు లేకున్నా చాలా సంతోషంగా ఉన్న వారిని చూశాను. అయితే నా జీవితం మొత్తంలో మోస్ట్‌ హానెస్ట్‌ పర్సన్‌ ను కలిశాను అంటే అది విద్యాధర్‌ అని చెప్పగలను. విద్యాధర్ ఒక గొప్ప మనిషి. ఈ సినిమాతో విద్యాధర్‌ వంటి గొప్ప స్నేహితుడిని సంపాదించుకున్నాను.

నా డీఓపీ విశ్వనాథ్‌. మేము ఈ సినిమా చేస్తున్న సమయంలో చాలా మంది ఏదో చేస్తున్నారు అనుకున్నారు. కానీ నాకు అప్పుడే చూస్తున్న సమయంలో అర్థం అయ్యింది. ఇది ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందని అనుకున్నాను. గామి గురించి ఎవరైనా మాట్లాడితే కచ్చితంగా డీఓపీ విశ్వనాథ్ గురించి మాట్లాడాల్సిందే.

ఒక మంచి సినిమాను చేయాలని కష్టం అయినా ఈ సినిమాను మొదలు పెట్టాం. ఒక మంచి పని చేసుకుంటూ వెళ్తే దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది అనుకున్నాను. మా సినిమాకు విక్కీ అన్న అండదండలు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో సినిమా పరిధి పెద్దగా అయ్యింది.

మ్యూజిక్‌ చాలా బాగుంది. నరేష్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. నేను ఇప్పటికే సినిమాను చూశాను. సినిమాను చూస్తున్న సమయంలో ఫోన్‌ వచ్చినా దాన్ని ఆఫ్‌ చేసి మీరు సినిమాను చూస్తారు. మీరు చూస్తున్నంత సమయం ఏదో ఒక క్యారెక్టర్‌, సంగీతం లేదా ల్యాండ్‌స్కేప్ ప్రతీది మిమ్ములను హోల్డ్‌ చేస్తుంది.

ఈ సినిమాలో కనిపించిన ఉమ పాత్రలో హారిక నటించింది. ఆ పాత్ర ను చూస్తున్న సమయంలో నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. చాలా సంవత్సరాల తర్వాత హారిక నటన చూసి కన్నీళ్లు వచ్చాయి. అద్భుతంగా నటించింది. సినిమా కథ లో ఉమ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఈమె ను గుర్తు పెట్టుకోండి.

మీ అందరితో సినిమా చూడాలి అనుకున్నాను. కానీ మీకు సినిమా గురించి నిజాలు చెప్పాలి అనే ఉద్దేశ్యంతో, సినిమా గురించి ఎక్కువ చెప్పొద్దు.. తక్కువ చెప్పొద్దు అనే ఉద్దేశ్యంతో ఈ రోజు మధ్యాహ్నమే సినిమాను చూశాను. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. సినిమా మైండ్‌ నుంచి మొదలై గుండె వరకు వచ్చి పూర్తి అవుతుంది.

సినిమా ను చాలా నిజాయితీగా చేశాం. చాలా పెద్ద రిస్క్ లు చేశాం. ఇవన్నీ దేవుడు చూశాడేమో అందుకే లీఫ్‌ ఇయర్ రోజు ట్రైలర్‌ రిలీజ్‌, మహా శివ రాత్రి రోజు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇవన్నీ మేము ప్లాన్‌ చేయకుండానే అయ్యాయి. దేవుడు మా వెంట ఉండి నడిపించడం వల్లే ఇవన్నీ సాధ్యం అయినట్లుగా భావిస్తున్నాను.

కొత్త తరహా సినిమాను చూడాలి అనుకునే ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. మెల్లగా సినిమాలోకి వెళ్తారు.. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మీ వెంటే ఈ సినిమా ఉంటుంది. మార్చి 8న ఈ సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను అన్నాడు.

Tags:    

Similar News