'గామి' వేడుకలో SKN మంత్రాలు.. హీరో షాక్
ఈ ఈవెంట్ లో హీరో అడివి శేష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.
విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌందరి హీరోయిన్ గా విద్యాధర్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందిన గామి సినిమా రేపు మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది.
ఈ ఈవెంట్ లో హీరో అడివి శేష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ఇటీవల బేబీ సినిమాతో నిర్మాతగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న నిర్మాత ఎస్‌కేఎన్ కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఆయన స్పీచ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ వేడుకలో కూడా ఆయన తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.
ఎస్‌కేఎన్ మాట్లాడేందుకు ముందుకు వచ్చిన సమయంలో జనాలు పెద్ద ఎత్తున హీరో హీరో అంటూ అరవడం మొదలు పెట్టారు. ఈ టైప్ ర్యాగింగ్ ఏంటి అంటూ ఆయన సిగ్గు పడుతూ తన స్పీచ్ ను మొదలు పెట్టాడు. ఎస్‌కేఎన్ ఎప్పటిలాగే తన స్పీచ్ లో చలోక్తులను విసిరాడు.
ఆయన మాట్లాడుతూ... హాలీవుడ్ లో సినిమాలు ఇంతగా తీస్తుంటే మనమేమో ఇంట్లో సెల్లార్ లో తీస్తున్నాం అనిపిస్తుంది. అలాంటప్పుడు తెలుగు సినిమా నుంచి వచ్చిన ఆన్సర్ గామి. గత నెల మొత్తం కూడా మలయాళ సినిమాల కోసం థియేటర్ల వైపు పరుగులు తీశాం.. వారి సినిమాలపై పొగడ్తల వర్షం కురిపించాం. వారి కంటెంట్, నటన, విజువల్స్ అన్నీ కలిపి వస్తున్న సినిమా గామి.
ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు తప్పకుండా అంతా ఎంకరేజ్ చేయాలి. ఆరు నెలలు డేట్లు లేట్ అయితేనే ఆ సినిమాతో నాకు కనెక్షన్ పూర్తి అయ్యిందని అనే హీరోలు ఉన్న మన ఇండస్ట్రీలో ఆరు సంవత్సరాలుగా గామి సినిమా కోసం విశ్వక్ సేన్ కష్టపడ్డాడు. విజువల్స్ చూస్తూ ఉంటే విశ్వక్ సేన్ పడ్డ కష్టం కనిపిస్తోంది.
ట్రైలర్ చివర్లో లయన్ దూకే షాట్ చూస్తూ ఉంటే.. మనం ఎప్పుడెప్పుడు బాక్సాఫీస్ వద్ద దూకి టికెట్లు తీసుకుని సినిమా చూస్తామా అన్నట్లుగా ఉంది. ఈ సినిమాకు యూవీ క్రియేషన్స్ వారు అండగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఈ సినిమాలో నటించడం సంతోషం.
ఈ శివ రాత్రి బాక్సాఫీస్ వద్ద నవరాత్రి ని తలపించాలని, గామి సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. చివర్లో ఎస్‌కేఎన్ చెప్పిన మంత్రాలు అందరిని ఆకర్షించాయి. ఆ మంత్రాల అర్థం ఏంటా అన్నట్లుగా అంతా షాక్ అయ్యారు. వెనకే ఉన్న విశ్వక్ సేన్ కూడా షాక్ అయ్యినట్లుగా అలా చూస్తూ ఉండి పోయారు.