గదర్ 2 బీభత్సం.. దున్నేస్తోందిగా
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ దేఓల్, హీరోయిన్ అమీషా పటేల్ చిత్రం గదర్ 2. ఉత్కర్ష్ శర్మ నిర్మాతగా దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించారు
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ దేఓల్, హీరోయిన్ అమీషా పటేల్ చిత్రం గదర్ 2. ఉత్కర్ష్ శర్మ నిర్మాతగా దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 11వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇంకా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాలు ఊహించని విధంగా భారీ కలెక్షన్లను నమోదు చేస్తోంది.
ఫామ్ లోలేని సీనియర్ హీరో అయిన సన్నిదేఓల్ ఈ రేంజ్ భారీ హిట్ ను అందుకుని ఎక్స్ లెంట్ కలెక్షన్లను అందుకుంటారని అస్సలు ఎవరూ ఊహించలేదు. మొదటి వీకెండ్ లోనే కాదు ఆగస్ట్ 15 గవర్న్ మెంట్ హాలీడే రోజున ఈ చిత్రం కళ్లు చెదిరే వసూళ్లను అందుకుంది. నిన్న ఒక్క రోజే సుమారు రూ. 56కోట్లను అందుకుంది.
బాలీవుడ్ లో సింగిల్ డే ఇంతటి హైయెస్ట్ నెట్ కలెక్షన్లను చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మొన్న ఆదివారం కూడా రూ.52కోట్ల వసూళ్లు చేసింది. మొత్తంగా ఐదు రోజుల్లో రూ.227కోట్లను సాధించింది. వాస్తవానికి ఈ చిత్రానికి పోటీగా వచ్చిన అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక సౌత్ ఇండియాలోనూ రజనీ జైలర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో ఇండిపెండెన్స్ డేన గదర్ 2కు స్క్రీన్స్ కాస్త తక్కువగా దొరికాయి. లేదంటే ఈ చిత్రం నిన్న ఒక్కరోజే రూ.70కోట్ల వరకు సాధించేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తంగా ఈ రెండు హిందీ చిత్రాలతో బీటౌన్ లో అన్ని సింగిల్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ ఫుల్ అవ్వగా, మల్టీ ప్లెక్సులు 90శాతం ఆక్యూపెన్సీని నమోదు చేశాయట. కరోనా ఎఫెక్ట్, ఓటీటీ డామినేషన్ పరిస్థితుల్లో ఓ హిందీ సినిమా ఈ రేంజ్ భారీ రెస్పాన్స్ అందుకోవడం విశేషమనే చెప్పాలి. అంతకుముందు షారుక్ పఠాన్ ఈ స్థాయిలో రెస్పాన్స్ అందుకోగా.. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రమే భారీ విశేష ప్రజాదరణ అందుకుంది.
ఇప్పుడీ చిత్రానికి వచ్చే రెస్పాన్స్ తో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. అంతకుముందు వచ్చిన షారుక్ పఠాన్ కూడా బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గదర్ 2 రాబోయే వీకెండ్స్ లోనూ ఇలానే జోరుతో కొనసాగుతుందా, షారుక్ పఠాన్ ను అధిగమించి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ ఫిల్మ్ గా నిలుస్తుందా లేదా అన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో...