గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్.. US బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..

అయితే సంక్రాంతి సినిమాల్లో పాన్ ఇండియా చిత్రాలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే అమెరికాలో ఓపెన్ అయ్యాయి.

Update: 2025-01-02 10:10 GMT

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముందుగా గేమ్ ఛేంజర్ తో చరణ్ వస్తుండగా.. ఆ తర్వాత రెండేసి రోజుల గ్యాప్ లో బాలయ్య డాకు మహరాజ్ తో.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో రానున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా సినిమాల మేకర్స్ పూర్తి చేసేశారు! ఇప్పుడు ప్రమోషన్స్ పైనే ఫోకస్ పెట్టారు. వాటితోనే బిజీగా ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యేలా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి విన్నర్ గా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే సంక్రాంతి సినిమాల్లో పాన్ ఇండియా చిత్రాలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే అమెరికాలో ఓపెన్ అయ్యాయి. అమెరికాలో 395 పైగా లొకేషన్స్ లో 1130కుపైగా షోలు గేమ్ ఛేంజర్ కు పడనుండగా.. ఇప్పటి వరకు $380K ప్రీ బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మరోవైపు 125కి పైగా లొకేషన్లలో 340కుపైగా డాకు మహారాజ్ షోస్ పడనున్నాయి. ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ లో ఆ మూవీ ఇప్పటి వరకు $92K వసూలు చేసింది. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కు 8 రోజులు ఉండగా, డాకు మహారాజ్ కు 10 రోజులు ఉన్నాయి. కానీ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు యావరేజ్ గా జరుగుతున్నాయనే చెప్పాలి.

అయితే బుకింగ్స్ లో స్పీడ్ భారీగా పెరగాల్సి ఉంది. అందుకోసం సినిమాలపై మేకర్స్ మరింత బజ్ ను క్రియేట్ చేయాలి. థియేట్రికల్ టైలర్స్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలి. వేరే లెవెల్ కట్ తో మెప్పించాలి. అలా రెండు సినిమాల ట్రైలర్ల రిలీజ్ తర్వాత.. బుకింగ్స్ ట్రెండ్ లో గ్రోత్ కచ్చితంగా ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.

ఇక చిత్రాల విషయానికొస్తే.. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గేమ్ ఛేంజర్ ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించగా.. దిల్ రాజు నిర్మించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డాకు మహరాజ్ ను బాబీ కొల్లి రూపొందించారు. యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించారు. మరి ఆ రెండు మూవీస్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News