గేమ్ ఛేంజర్.. రాజుగారి స్ట్రాటజీ దెబ్బేసిందా?
తెలుగులో మిగతా వాళ్ళు ఎంత పోటీ పడినా శంకర్ కూడా తెలుగులో తన సినిమాలను దిల్ రాజు ద్వారానే రిలీజ్ చేయించేవారు.
శంకర్ మీద నమ్మకంతో దిల్ రాజు చాలాసార్లు పెట్టుబడులు పెట్టారు. శంకర్ భారతీయుడు సినిమా నుంచి చాలా వరకు తెలుగు డబ్బింగ్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఆ సినిమాలతో భారీగా ప్రాఫిట్స్ కూడా అందుకున్నారు. తెలుగులో మిగతా వాళ్ళు ఎంత పోటీ పడినా శంకర్ కూడా తెలుగులో తన సినిమాలను దిల్ రాజు ద్వారానే రిలీజ్ చేయించేవారు. అంతగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.
ఆ నమ్మకంతోనే కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. ఇక ఇండియన్ 2తో అది సాధ్య పడలేదు. ఇక రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ ను గ్రాండ్ గా నిర్మించారు. టాలీవుడ్‌లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాపై నిర్మాత దిల్ రాజు భారీ ఆశలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టింది.
అయితే, విడుదలైన మొదటి రోజు నుంచే సినిమా మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ముఖ్యంగా, మొదట నా నా హైరానా పాటను తొలగించడం ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు తెచ్చింది. అల్బమ్‌లో అత్యుత్తమ పాటగా నిలిచిన నా నా హైరానా సినిమా నుంచి తొలగించడం, అది విడుదలైన రోజే ట్రోలింగ్‌కు కారణమైంది. ఈ పాట విజువల్స్‌లో బాగా ఆకట్టుకునేలా ఉన్నాయని అందరూ భావించారు.
కానీ, దిల్ రాజు ఈ పాటను సినిమా విడుదలకు ముందు తొలగించడమే కాకుండా, జనవరి 14 నుంచి తిరిగి థియేటర్లలో జోడించాలనే స్ట్రాటజీని తీసుకున్నారు. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వచ్చింది. దిల్ రాజు ఈ ప్లాన్‌పై పూర్తిగా నమ్మకం ఉంచినప్పటికీ, అది ఫలితాన్నివ్వలేదు. సినిమా టాక్ నెగిటివ్ గా మారడంతో పాట తిరిగి జోడించడం ద్వారా కలెక్షన్లలో ఎలాంటి మార్పు రాలేదు.
పైగా, ఈ నిర్ణయం ప్రేక్షకుల మనసును మరింత నొప్పించింది. పాట తొలగించిన నిర్ణయం అనవసరమైందని, చిత్రబృందం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శలు గట్టిగానే వచ్చాయి. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ చిత్రానికి అనుకున్న స్థాయి రిజల్ట్ రాకపోవడంతో, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కెరీర్‌లో ఇది పెద్ద ఫ్లాప్‌గా మిగిలే అవకాశముంది. నా నా హైరానా పాటను మళ్లీ జోడించినప్పటికీ, ఈ అప్డేట్ గురించి అధికారిక సమాచారం ఎవరికి అందించకపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ నిర్ణయంపై ప్రేక్షకుల్లో కాస్త డివైడ్ టామ్ వచ్చింది. ఇటువంటి నిర్ణయాలు భారీ సినిమాలపై ఎంతటి ప్రభావం చూపుతాయో గేమ్ ఛేంజర్ క్లారిటీ ఇచ్చింది. ఇక శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్, దిల్ రాజు బిజినెస్ ప్లాన్స్ అన్నీ ఉన్నా, సరైన ప్రణాళిక లేకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఇక, రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఏమైనా మేజర్ టర్న్ తీసుకుంటుందా లేక ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్‌నే మిగిల్చుతుందా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ దిల్ రాజు ఈ పాటను తొలగించకుండా విడుదల చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.