'గేమ్ ఛేంజర్' ని మైండ్ లోకి ఎక్కించారిలా!
శంకర్ సినిమా అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ అంచనాలు అందుకోకపోతే శంకర్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా తెలుసు.
'గేమ్ ఛేంజర్' ఎలా ఉంటుంది? అన్నది ఇప్పటికే ఓ అంచనా ఏర్పడింది. 'ఒకే ఒక్కడు', 'జెంటిల్మెన్' తరహా పక్కా కమర్శియల్ సినిమా అని, అదిరిపోయే ప్లాష్ బ్యాక్, ఇంటర్వెల్ ఎపిసోడ్లు వంటివి శంకర్ మార్క్ లో ఉంటాయని గేమ్ ఛేంజర్ కి పనిచేసిన రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పేసారు. ఇక అమెరికా ఈవెంట్లో దర్శకుడు సైతం పక్కా కమర్శియల్ సినిమా అని తెలుగు ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన సినిమా అన్నట్లే మాట్లాడారు.
'ఒక్కడు', 'పోకిరి' లాంటి సినిమాలు తనకు చేయాలని ఉందని ఆ డ్రీమ్ ఈ సినిమాతో కాస్త నెరవేరినట్లుగానే మాట్లాడారు. గేమ్ ఛేంజర్ ద్వారా తానేదో అద్భుతం చేసానని గొప్పగా చెప్పలేదు. అన్ని అంశాలున్న ఓ మంచి కమర్శియల్ సినిమా చేసినట్లు కుండబద్దలు కొట్టేసారు. క్లైమాక్స్ లో చరణ్ పెర్పార్మెన్స్ కి జాతీయ అవార్డు వచ్చే స్తుందంటూ పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రశంసించారు. ఇక నిర్మాత దిల్ రాజు అయితే ఔట్ పుట్ చూసుకుని తొడ కూడా కొట్టాలని ఉందని పబ్లిక్ గానే అన్నారు. మరి ఈ రకమైన వ్యాఖ్యానాల వెనుక కారణం ఏంటి? అంటే రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
శంకర్ సినిమా అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ అంచనాలు అందుకోకపోతే శంకర్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా తెలుసు. అందుకు ఉదాహరణ ఈ గత సినిమాలు. 'ఐ', '2.0' చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోలేదు. ఇక 'భారతీయుడు' సీక్వెల్ ప్రకటన తర్వాత 'ఇండియన్ 2' ప్రకటించడంతో? శంకర్ సోసైటీలో మరో సంచనలనంతో రాబోతున్నాడని అంచనాలు ఆకాశాన్నంటాయి.
కానీ రిలీజ్ తర్వాత వాటిని ఏమాత్రం అందుకోలేదు. ముఖ్యంగా 'ఇండియన్ -2' గురించైతే ఇండియా అంతా మాట్లాడుకుంది. అవినీతి, లంచగొండి తనాన్ని నెటి జనరేషన్ కి ఎలా ఎక్కిస్తాడనే దానిపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. కానీ రిలీజ్ తర్వాత షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో 'గేమ్ ఛేంజర్' విషయంలో అలాంటి అనవసరమైన హైప్ తీసుకురాకుండా తాను తీసింది మాత్రమే శంకర్ క్రిస్టల్ క్లియర్ గా వివిధ వేదికలపై చెప్పినట్లు కనిపిస్తుంది. మానసికంగా 'గేమ్ ఛేంజర్' ఆడియన్స్ కి ఆ విధంగా సిద్దంగా ఉండండని బుర్రల్లోకి ఎక్కించినట్లు ఉంది. మరి ఎలాంటి సినిమా తీసారన్నది తేలాలంటే జనవరి 10 వరకూ వెయిట్ చేయాల్సిందే.