హిందీలో టాప్ 10 సౌత్ కలెక్షన్స్.. గేమ్ ఛేంజర్ లెక్క ఎంతంటే?
ఫస్ట్ డే హిందీ వసూళ్లలో డిసెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం గమనార్హం. రామ్ చరణ్‌కు ఉన్న మాస్ క్రేజ్, అభిమానుల నుండి వచ్చిన మద్దతు కలెక్షన్లపై ప్రభావం చూపించాయి.
గేమ్ ఛేంజర్ విడుదలకు ఒక నెల రోజుల ముందు వరకు కూడా సరైన బజ్ అయితే క్రియేట్ కాలేదు. కానీ దిల్ రాజు మెల్లమెల్లగా ప్రమోషన్ స్ట్రాటజీ ద్వారా పాజిటివ్ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, సినిమా టాక్ మాత్రం అనుకున్నంత పాజిటివ్‌గా రాలేదు. శంకర్ మేకింగ్ విధానం అంత కొత్తగా ఏమి లేదనే టాక్ వస్తోంది. ఇక రామ్ చరణ్ మాత్రం తనదైన శైలిలో అప్పన్న పాత్రలో మెప్పించినట్లు చెబుతున్నారు.
అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టినా, హిందీ మార్కెట్‌లో మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. కానీ, ఫస్ట్ డే హిందీ వసూళ్లలో డిసెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం గమనార్హం. రామ్ చరణ్‌కు ఉన్న మాస్ క్రేజ్, అభిమానుల నుండి వచ్చిన మద్దతు కలెక్షన్లపై ప్రభావం చూపించాయి. కానీ హిందీ వెర్షన్‌లో పెద్దగా బజ్ లేకపోవడంతో వసూళ్లు కొద్దిగా పరిమితంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితి సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్ల లోపాన్ని చూపించవచ్చు. హిందీలో మొదటి నుంచి కూడా సినిమాకు పెద్దగా సౌండ్ క్రియేట్ కాలేదు. ఇక టాలీవుడ్ చిత్రాలు గతంలో హిందీ మార్కెట్‌లో కూడా అద్భుత విజయాలను సాధించాయి. పుష్ప: ది రూల్, RRR, బాహుబలి 2 వంటి సినిమాలు అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటితో పోలిస్తే, గేమ్ ఛేంజర్ హిందీ మార్కెట్‌లో కొంత వెనుకబడి ఉందనిపించవచ్చు.
అయితే, హిందీ వెర్షన్‌పై క్రేజ్ తక్కువగా ఉన్నప్పటికీ, మొదటి రోజున 8.64 కోట్ల వసూళ్లు సాధించడం సాధారణ విషయమేమీ కాదు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఏదైనా మ్యాజిక్ జరిగితే రానున్న రోజుల్లో ఈ సినిమా హిందీ మార్కెట్‌లో మరింత వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో లైగర్ కు డిజాస్టర్ టాక్ వచ్చినా వారం తరువాత కూడా హిందీలో డిసెంట్ వసూళ్ళను రాబట్టింది.
హిందీ వెర్షన్ సౌత్ మూవీస్ టాప్ డే 1 కలెక్షన్లు:
1. పుష్ప 2 ది రూల్: 72 కోట్లు
2. కేజీఎఫ్ 2:53.95 కోట్లు
3. బాహుబలి 2: 41 కోట్లు
4. ఆదిపురుష్: 37.25 కోట్లు
5. సాహో: 24.4 కోట్లు
6. కల్కి 2898 AD: 22.50 కోట్లు
7. RRR: 20.07 కోట్లు
8. 2.0: 19.74 కోట్లు
9. సలార్: 15.75 కోట్లు
10. గేమ్ ఛేంజర్: 8.64 కోట్లు
11. దేవర: 7.95 కోట్లు