గేమ్ ఛేంజర్ నానా హైరానా.. అదో హైరానా..!
ఐతే ఈ సాంగ్ ని ఇండియాలోనే ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశారు. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్స్ లో సాంగ్ విజువల్ గా అదిరిపోతుందని అనిపించింది.
శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. ఈ సినిమా విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ పెట్టారు. ముఖ్యంగా సాంగ్స్ విషయంలోనే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఇన్ని కోట్లు అవసరమా అనుకున్న వారంతా కూడా సాంగ్ విజువల్స్ చూసి షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో అన్ని పాటలు ఒక లెక్క అయితే సినిమాలోని నానా హైరానా పాట ఒక లెక్క. రామ్ చరణ్, కియరా అద్వాని మధ్య డ్యూయెట్ సాంగ్ గా నానా హైరానా సాంగ్ తెరకెక్కించారు.
ఐతే ఈ సాంగ్ ని ఇండియాలోనే ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశారు. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్స్ లో సాంగ్ విజువల్ గా అదిరిపోతుందని అనిపించింది. ఐతే ప్రోమో చూసి ఆహా ఓహో అనుకున్న ఈ సాంగ్ సినిమాలో మిస్ అయ్యింది. ఫస్ట్ డే సినిమా చూసిన ఆడియన్స్ అంతా సినిమాలో నానా హైరానా సాంగ్ మిస్ అవ్వడం చూసి షాక్ అయ్యారు. సినిమా చూసిన ఆడియన్స్ నిరుత్సాపడడంలో అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
నానా హైరానా సాంగ్ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆగిందని.. 14 నుంచి సాంగ్ యాడ్ చేస్తామని అన్నారు. ఐతే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నానా హైరానా సాంగ్ మిస్ అవ్వడంపై క్లారిటీ ఇచ్చారు. సినిమా ఫ్లోకి అడ్డొస్తుందని సాంగ్ స్కిప్ చేశారనే విషయాన్ని చెప్పాడు థమన్. సినిమా సాంగ్ కి 10 కోట్ల దాకా ఖర్చు అయ్యిందని టాక్. మరి అంత ఖర్చు పెట్టి తీరా రిలీజ్ టైం కు ఫ్లో మిస్ అవుతుందని తీసేయడం షాక్ ఇస్తుంది.
రాం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా విజువల్ గ్రాండియర్ గా ప్రేక్షకుల ను మెప్పిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా సంక్రాంతికి వచ్చిన మరో సినిమా డాకు మహారాజ్ కి కూడా థమన్ మ్యూజిక్ అందిచాడు. థమన్ సినిమాల్లో బిజిఎం అదిరిపోతుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ రెండు సినిమాలతో మరోసారి థమన్ మ్యూజిక్ స్టామినా అందరికీ తెలిసేలా చేస్తుంది.