గేమ్ ఛేంజర్.. తేల్చుకునే టైమొచ్చింది!
కాబట్టి ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక లీకైన సాంగ్ తరహాలో అయితే మొదటి సాంగ్ ఉండకూడదు అని కోరుకుంటున్నారూ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేజర్ సినిమా మొదలై చాలా కాలం అయినప్పటికీ కూడా సినిమా అప్డేట్స్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య పుట్టుకొస్తూనే ఉంది. ముఖ్యంగా దర్శకుడు శంకర్ హఠాత్తుగా ఇండియన్ 2ను మళ్లీ రీస్టార్ట్ చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ ప్రాజెక్టుకు చాలా బ్రేకులు అయితే పడ్డాయి.
దాంతోపాటు బడ్జెట్ కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. మొదట అనుకున్న బడ్జెట్ కు ఇప్పుడు కొనసాగుతున్న బడ్జెట్ కు ఏ మాత్రం పొంతన లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాజెక్టును మాత్రం వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని నిర్మాత ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా ఫాన్స్ లో కొంత వసంతృప్తి ఉంది.
ఇప్పటివరకు ఒక పోస్టర్ తప్పితే ఏమి రాలేదు. ఇప్పటికే కొన్నిసార్లు మీడియా ఇంటర్వ్యూలలో దిల్ రాజు పూర్తిస్థాయిలో అప్డేట్ అనేది శంకర్ గారి చేతిలోనే ఉంది అని, ఆయన ఎప్పుడూ ఇస్తే అప్పుడే అప్డేట్స్ వస్తాయి అని చాలా క్లారిటీగా చెప్పారు. అయితే ఈ దసరాకు మాత్రం శంకర్ కూడా అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సినిమా వచ్చే సంక్రాంతికి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఈ సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పాటతోనే సినిమా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు లీకైన ఒక సాంగ్ సినిమాపై చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. థమన్ ఇటీవల కాలంలో మంచి మ్యూజిక్ ఇవ్వడం లేదు అని కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి.
కాబట్టి ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక లీకైన సాంగ్ తరహాలో అయితే మొదటి సాంగ్ ఉండకూడదు అని కోరుకుంటున్నారూ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ పాటతోనే మంచి ఇంప్రెషన్ అందుకుంటేనే ఈ సినిమా ప్రమోషన్స్ కు ఉపయోగపడుతుంది. మరి థమన్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమా సాంగ్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.