.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

చరణ్ సినిమా.. మెగా ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిస్తున్నారుగా..!

ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్ గేమ్ చేంజర్ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

Update: 2024-06-29 17:30 GMT

మెగా పవర్ స్టార్ కాస్త RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ తన ప్రతి సినిమా విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడు. ఐతే నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ గా రాబోతున్న చరణ్ ఆ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఆయన మార్క్ మూవీగా అదరగొట్టబోతుందని టాక్. ఐతే ఈలోగా శంకర్ ఇండియన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇండియన్ 2 సినిమా ఎఫెక్ట్ కచ్చితంగా గేమ్ చేంజర్ మీద ఉంటుందని చెప్పొచ్చు.

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో గేమ్ చేంజర్ కూడా ఒకటి.. ఆ సినిమా ఎప్పుడొస్తుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఓ పక్క స్టార్ హీరోలంతా కూడా తమ సినిమాల రిలీజ్ లను షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఆగష్టుకి వస్తుందని అనుకున్న పుష్ప 2 కాస్త డిసెంబర్ కి వెళ్లగా దసరాకి రిలీజ్ అనుకున్న దేవర మూడు వారాల ముందుకు వచ్చాడు.

Read more!

తెలుగు పాన్ ఇండియా సినిమాలే కాదు పాన్ ఇండియా రిలీజ్ గా రాబోతున్న ఇండియన్ 2, కంగువ సినిమాలు కూడా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. కానీ చరణ్ గేమ్ చేంజర్ విషయంలో మేకర్స్ ఆ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దేవర దసరాని వదిలాడు కాబట్టి దసరాకి గేమ్ చేంజర్ వస్తుందని మెగా ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ చిత్ర యూనిట్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు.

ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్ గేమ్ చేంజర్ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దీవాళికి రిలీజ్ కన్ఫర్మ్ అయితే అనౌన్స్ చేసేయొచ్చు కదా అనుకోవచ్చు.. సినిమా దాదాపు పూర్తి కావొచ్చినా ఎక్కడ ఏమాత్రం డౌట్ కొట్టినా సినిమా రిలీజ్ వాయిదా వేయాలని అనుకుంటున్నారు. అందుకే గేమ్ చేంజర్ రిలీజ్ విషయంపై దర్శక నిర్మాతలు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇండియన్ 2 ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ కూడా గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేకపోయారు.

మరోపక్క నిర్మాత దిల్ రాజు మాత్రం శంకర్ సార్ ఎప్పుడు రిలీజ్ అంటే అప్పుడే సినిమా రిలీజ్ చేస్తామని అంటున్నారు. గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ముందో వెనకో కానీ ఈ ఇయర్ లో తప్పనిసరిగా సినిమా రిలీజ్ చేసేలా చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News