తమిళ సినిమాలతో పోటీ.. మెగా హీరో మూవీ డౌటే..?
పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత సినిమాల కాంపిటేషన్ ఒక్క భాషకి మాత్రమే పరిమితం కాలేదు.
పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత సినిమాల కాంపిటేషన్ ఒక్క భాషకి మాత్రమే పరిమితం కాలేదు. ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే పాన్ ఇండియా మూవీస్ తో మన స్టార్స్ పోటీ పడాల్సి వస్తుంది. తమిళ్ స్టార్ హీరోలు ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవల్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి రేంజ్ సక్సెస్ లు చూడలేదు. అయితే ప్రస్తుతం అక్కడ కూడా 300+ కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా బ్రాండ్ తోనే స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నారు.
తమిళ్ హీరోల కాన్సెప్ట్స్ ఎప్పుడూ కూడా కొత్తగా ఉంటాయి. యూనివర్సల్ గా అందరికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తోనే మూవీస్ చేస్తారు. అయితే తమిళ్ నేటివిటీని ఎక్కువ మిక్స్ చేయడం వలన పాన్ ఇండియా స్థాయిలో వారి చిత్రాలు పెద్దగా మెప్పించలేదనే టాక్ ఉంది. అయితే ఈ సారి పరిస్థితి వేరేగా ఉంది. సూర్య పీరియాడిక్ జోనర్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కంగువ మూవీ చేశారు. అలాగే మణిరత్నం, శంకర్ కలయికలో వస్తోన్న థగ్ లైఫ్ కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశంతోనే సిద్ధం అవుతోంది.
అలాగే అజిత్ విడామయూర్చి సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా దీపావళిని టార్గెట్ గా పెట్టుకున్నాయి. వీటిలో ఒక్క సినిమా అయిన దీపావళికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ కి పోటీగా కోలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రేసులో నిలిచే అవకాశం ఉంది. అదే జరిగితే సినిమా బాక్సాఫీస్ పైన ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఒక వేళ దీపావళి డేట్ అనుకున్నట్లు సెట్ అవ్వకపోతే డిసెంబర్ క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ తేవాలని అనుకుంటున్నారంట. ఆ నెలలో ఐకాన్ స్టార్ పుష్ప ది రూల్ మొదటి వారంలో రిలీజ్ అవుతోంది.
మూడో వారంలో నాగ చైతన్య తండేల్ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. నితిన్ రాబిన్ హుడ్ కూడా డిసెంబర్ లోనే వస్తోంది. బాలయ్య 109 మూవీ కూడా డిసెంబర్ లోనే ఉండొచ్చని అంటున్నారు. ఈ నాలుగు సినిమాలు వరుసగాగా రిలీజ్ కి ఉన్నాయి. అందుకే దీపావళికి రావాలని అనుకుంటున్నారు. అయితే తమిళ్ నుంచి మూడు సినిమాలు, దీపావళికి రేసులో ఉండటంతో గేమ్ చేంజర్ రిలీజ్ ఉండదేమో అనే డౌట్ వస్తోంది. మరి ఈ కన్ఫ్యూజన్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.