గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ లెక్కలు.. ఒక్కొక్కరు ఒక్కోలా..

ఓవర్సీస్ రేటు విషయంలో ప్రస్తుతం డిఫరెంట్ వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఓ బడా సంస్థకు రూ.27 కోట్లకు రైట్స్ ను అప్పజెప్పనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Update: 2024-01-29 18:41 GMT

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఆ మధ్య నిర్మాత దిల్ రాజు.. సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఓ పెద్ద క్వశ్యన్ మార్క్.

గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో గేమ్‌ ఛేంజర్‌ ఓవర్సీస్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ రేటు విషయంలో ప్రస్తుతం డిఫరెంట్ వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఓ బడా సంస్థకు రూ.27 కోట్లకు రైట్స్ ను అప్పజెప్పనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు కూడా అదే చెబుతున్నారట. కానీ మరికొందరు మాత్రం రూ.22 కోట్లకు అమ్ముడయ్యాంటున్నారు.

అయితే రూ.22 కోట్లకు విక్రయించారనడం వెనుక ఓ కారణం కూడా ఉందట. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను చాలా నెలల క్రితమే ఫార్స్ ఫిల్మ్స్ సంస్థకు రూ.22 కోట్లకు అమ్మేశారట మేకర్స్. కానీ సినిమా రిలీజ్ లేట్ అవుతుండడంతో ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసిందట. అంతేకాకుండా వడ్డీతో సహ చెక్కును మేకర్స్ కు రిటర్న్ చేసిందట. దీంతో మళ్లీ మరో సంస్థకు రూ.27 కోట్లకు విక్రయించాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే ఓ బయ్యర్ ను కూడా సంప్రదించారట.

గ్లోబల్ స్టార్ గా రామ్‌ చరణ్ కు ఉన్న క్రేజ్ తోనే ఇంత భారీ డీల్ జరగనుందని చరణ్ ఫాన్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. నటి అంజలి మరో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది.

ఇండియన్ 2 సినిమాను కూడా సమాంతరంగా శంకర్ తీయాల్సి రావడంతో ఆలస్యం అవుతోంది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నారు చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.


Tags:    

Similar News