'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ టార్గెట్ అదే
ఈ సినిమాను మార్చి మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాల ఇన్ సైడ్ టాక్
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మెసేజ్‌కు భారీ కమర్షియల్ హంగులను జోడించి సినిమాలను తీర్చిదిద్దుతారు. ఎక్కడా రాజీ పడకుండా లార్జన్ దేన్ లైఫ్ అన్నట్టుగా సినిమా చూపిస్తుంటారు. ఆయితే గత కొంతకాలంగా భారీ హిట్లను అందుకోలేకపోయిన ఆయన.. ప్రస్తుతం కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2', రామ్‌చరణ్‌తో 'గేమ్ ఛేంజర్'పైనే ఆశలు పెట్టుకున్నారు. సినీ ప్రియులు కూడా ఈ రెండు చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ రెండింటిలో 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. అదుగో సినిమా వచ్చేస్తుంది. ఇదిగో సినిమా వచ్చేస్తుందంటూ మూవీ మేకర్స్ ఊరిస్తున్నారే తప్ప సరైన డేట్‌ను చెప్పట్లేదు. ఆ మధ్యలో వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా ఆ తర్వాత వేసవికి రిలీజ్ అవుతుందనే ప్రచారం కూడా సాదింది. కానీ దీనిపై ఓ క్లారిటీ రాలేదు.
వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుని రిలీజ్‌కు రెడీ అయిపోయేది. కాకపోతే మధ్యలో ఆగిపోయిన 'భారతీయుడు 2' మళ్లీ శంకర్ లైనప్‌లోకి ఎంట్రీ ఇచ్చేసరికి అన్నీ మారిపోయాయి. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ షెడ్యూల్స్ పోస్ట్ పోన్ అయిపోయాయి. శంకర్ రెండు చిత్రాలకు ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ దర్శకత్వం చేయడం ప్రారంభించారు.
అదే సమయంలో మెగా అభిమానులు గేమఛేంజర్ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాల ఇన్ సైడ్ టాక్.
అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సమయంలోనే చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే వచ్చే సంక్రాంతికి కమల్‌హాసన్ భారతీయుడు 2 దాదాపుగా కన్ఫామ్ అయిపోయిందని తెలిసింది.
అంటే రెండు నెలల గ్యాప్‌లో శంకర్ తన రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేయనున్నారన్న మాట. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చిత్రం హిట్ అయినా శంకర్ రేంజ్ మళ్లీ భారీగా పెరిగిపోతుంది. ఆయన గట్టి కమ్ బ్యాక్ ఇచ్చినట్టవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..