గేమ్ ఛేంజర్.. రాజుగారు ఇంకా ఎన్ని రోజులు భరిస్తారో..

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా సినిమా వస్తోంది అనగానే అందరి మొదట మిగిలిన ప్రశ్న అసలు ఈ సినిమా అనుకున్న టైం కి విడుదల చేస్తారా లేదా అని.

Update: 2023-09-28 03:15 GMT

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా సినిమా వస్తోంది అనగానే అందరి మొదట మిగిలిన ప్రశ్న అసలు ఈ సినిమా అనుకున్న టైం కి విడుదల చేస్తారా లేదా అని. ఎందుకంటే అప్పటికే దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను సగానికి పైగా పూర్తి చేశాడు. లైకా ప్రొడక్షన్స్ తో గొడవలు జరుగుతున్న టైంలోనే దిల్ రాజుతో సినిమా అనౌన్స్ చేసి స్పీడ్ గా స్టార్ట్ చేసేసారు.

తప్పకుండా ఏదో ఒక రోజు మళ్ళీ ఇండియన్ 2 సినిమా వివాదం తెరపైకి వస్తుంది అని అప్పటికే ఇండస్ట్రీలో గట్టి టాక్ అయితే వినిపించింది. కానీ దిల్ రాజు శంకర్ ను ఏ విధంగా నమ్మాడో గాని ఇప్పుడు ఇండియన్ 2 సినిమా ద్వారానే ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.

ఆలస్యం అయితే అయింది కాని అసలు సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుంది? రిలీజ్ ఎప్పుడు విడుదల చేయాలి? అనే సందేహాలకు సమశానలు దొరకడం లేదు. ఫ్యాన్స్ కు అటు సమాధానం చెప్పలేక ఇటు శంకరును గట్టిగా అడగలేక రాజుగారు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా అనిపిస్తోంది.

ఎందుకంటే షూటింగ్ ఆలస్యం అయితే బడ్జెట్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ చేయడం అంటే అదొక పెద్ద టాస్క్ అని చెప్పాలి. రీసెంట్గా మొత్తానికి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు అని అనుకున్న టైంలోనే చరణ్ కు కాస్త గాయం కావడంతో మళ్లీ బ్రేక్ తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ శంకర్ కూడా ఇండియన్ టు పైనే పడినట్లుగా తెలుస్తోంది.

ఆ సినిమాను రెండు భాగాలుగా తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో పని భారం మరింత పెరిగింది. కాబట్టి గేమ్ ఛేంజర్ సినిమా పనులు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. గేమ్ ఛేంజర్ ను ఈ ఏడాదిలోపు ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ అది జరిగే పనిలో లేదు. ఇక సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో అయినా వస్తుందా అనుకుంటే ఆ అవకాశం కూడా కనిపించేలా లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి షూటింగ్ ను ఎప్పుడు ఫినిష్ చేస్తారో? ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో.. కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News