గణగణ మోగుతున్న మంగళవారం..!
‘గణగణ మోగాలిరా’ అంటూ సాగేపాట ఇది. అమ్మవారి సమక్షంలో సాగే పాట అనే విషయం అర్థమౌతోంది.
ఆర్ఎక్స్ 100 సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో కొత్త రకం ప్రేమ కథను పరిచయం చేశారు. ఈ కథ ప్రేమికులకు విపరీతంగా నచ్చేసింది. ఆ సినిమాలో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ తో పాటు, డైరెక్టర్ అజయ్ భూపతికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన మహా సముద్రం అనే సినిమాని తెరకెక్కించారు.
అయితే, ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దీంతో, చాలా కాలం గ్యాప్ తీసుకొని మంగళవారం సినిమా చేస్తున్నారు. తనకు మొదటి సినిమాతో హిట్ తెచ్చిపెట్టిన పాయల్ ని ఈ సినిమాలో కూడా సెలక్ట్ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కథను కూడా చాలా భిన్నంగా చూపించాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాట లిరికల్ వీడియోని విడుదల చేశారు. తెలుగు నెటివిటీకి అద్దం పట్టేలా సాగే పాట ఇది. ‘గణగణ మోగాలిరా’ అంటూ సాగేపాట ఇది. అమ్మవారి సమక్షంలో సాగే పాట అనే విషయం అర్థమౌతోంది. ఈ సినిమాకి అజనీష్ లోక్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఆయన కాంతార, వీరూపాక్ష సినిమాలకు సంగీతం అందించారు.
దీంతో, ఈ సినిమా మ్యూజిక్ పై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కాగా, ఈ మూవీ హిట్ అజయ్ భూపతి, పాయల్ కెరీర్ లకు చాలా అవసరం. సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నవారు ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
90వ దశకంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించ నటువంటి కొత్త జానర్ సినిమా అని దర్శకుడు చెబుతున్నాడు. సినిమాలో 30 పాత్రలుంటాయని, ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందట. చూడాలి మరి, ఈ మూవీ ఏ మేర ఆకట్టుకుంటుందో..!