గ‌ణ‌ప‌త్ ట్రైల‌ర్: టైగ‌ర్ ష్రాఫ్ యాక్ష‌న్ మోడ్ ఆన్

ఇప్పుడు 'గణపత్: ఎ హీరో ఈజ్ బోర్న్' ట్రైలర్ విడుదలైంది. ఇది రెగ్యుల‌ర్ యాక్ష‌న్ అంశాల‌తో టైగ‌ర్ ష్రాఫ్ పోరాట నైపుణ్యాల‌ను ఆవిష్క‌రించింది.

Update: 2023-10-09 16:52 GMT

మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో భారీ యాక్షన్ తో ర‌క్తి క‌ట్టించే హీరో టైగ‌ర్ ష్రాఫ్‌. అత‌డు న‌టించిన గ‌ణ‌ప‌త్ ఇదే కేటగిరీకి చెందుతుంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుదల కాగా చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు 'గణపత్: ఎ హీరో ఈజ్ బోర్న్' ట్రైలర్ విడుదలైంది. ఇది రెగ్యుల‌ర్ యాక్ష‌న్ అంశాల‌తో టైగ‌ర్ ష్రాఫ్ పోరాట నైపుణ్యాల‌ను ఆవిష్క‌రించింది.

2-నిమిషాల 27-సెకన్ల ట్రైలర్ డిస్టోపియన్ ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అప్ప‌టి రోజుల్లో దుష్ట‌ శక్తుల నుండి ప్రజలను రక్షించేవాడిగా టైగ‌ర్ ష్రాఫ్ పాత్ర క‌నిపిస్తుంది. ఇందులో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ఆద్యంతం ర‌క్తి క‌ట్టించాయి. దుష్టుల‌తో పోరాటంలో ఎన్ని ఎదురైనా చివ‌రికి అత‌డు గెలుస్తాడు.

ఈ ట్రైల‌ర్ లో కృతి స‌న‌న్ ని యాక్ష‌న్ క్వీన్ అవ‌తారంలో ప‌రిచ‌యం చేయ‌డం ఆస‌క్తిక‌రం. అయితే వీఎఫ్ ఎక్స్ కోసం చాలా శ్ర‌మించినా కానీ ఆశించిన రిజ‌ల్ట్ ని తేలేక‌పోయార‌ని, ట్రైల‌ర్ లో చూపించిన గ్రాఫిక్స్, విజువ‌ల్స్ వెల్ల‌డిస్తున్నాయి. 20 అక్టోబర్ 2023న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వికాస్ బ‌హ‌ల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ , వికాస్ బహ్ల్ నిర్మించారు.

ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక‌ ప్రభావవంతమైన పాత్రలో క‌నిపించ‌నున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవలే రిలీజైన మొదటి ట్రాక్, హమ్ ఆయే హైకి సానుకూల స్పంద‌న ద‌క్కింది. నిర్మాత జాకీ భగ్నాని ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ-''గణపత్ టీజర్ అలాగే విడుద‌లైన‌ సాంగ్‌కి అద్భుతమైన సానుకూల స్పందన రావడంతో నేను థ్రిల్లింగ్ గా ఉన్నాను.

అంద‌రినీ సంతృప్తి ప‌రిచే సినిమా చేసాం. ఇప్పుడు ట్రైలర్‌కి మా వీక్షకుల స్పందనలో అదే స్థాయి ప్రేమ ఉత్సాహం క‌నిపిస్తోంది. మునుముందు మ‌రింత ఆస‌క్తి క‌లిగించే ప్ర‌చార మెటీరియ‌ల్ తో మీ ముందుకు వ‌స్తాం'' అని అన్నారు.

Full View
Tags:    

Similar News