బిడ్డా.. ఇది బాలయ్య శ్రీలీల మాస్ ఫెస్టివల్..
'శంబో శంబో శంభోరే.. లంబోదర ఆయారే.. బోలో గణపతి బప్పా మోరియారే..' అంటూ సాగే ఈ పాటలో బాలయ్య, శ్రీలీల స్టెప్పులు ధూమ్ ధామ్ గా ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'భగవంత్ కేసరి'. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో... మూవీటీమ్ తాజాగా ఓ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ పాట ఆద్యంతం మాస్ అభిమానులను ఊర్రూతలూగించేలా సౌండ్ బాక్స్ లు దద్దరిల్లేలా ఉంది.
రీసెంట్ గా మూవీ నుంచి 'గణేశ్ ఆంథమ్' సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు మూవీటీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల 'చిచ్చా వచ్చాడు గట్టిగా కొట్టండహే' అంటూ చిందులేసి ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి పాటనే సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు మేకర్స్.
'శంబో శంబో శంభోరే.. లంబోదర ఆయారే.. బోలో గణపతి బప్పా మోరియారే..' అంటూ సాగే ఈ పాటలో బాలయ్య, శ్రీలీల స్టెప్పులు ధూమ్ ధామ్ గా ఉన్నాయి. తమన్ అందించిన మాస్ బీట్ కు వీరిద్దరు స్టెప్పులు అదరగొట్టేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సాంగ్ మొత్తం మంచి బీట్ లో కలర్ ఫుల్ గా సాగింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కరిముల్లా, మనీశా పండ్రంకి ఆలపించారు.
ఈ సాంగ్ లో వినాయక చవితి సంబరాలు జరుగుతూ ఉండగా.. అక్కడ శ్రీలీల అందరితో కలిసి చిందులు వేస్తూ ఉంటుంగి. ఈ లోగా అక్కడి వచ్చిన బాలయ్య.. 'సౌండ్ సరిపోలే బిడ్డా జర గట్టిగా చేయమను' అంటూ శ్రీలీలకు చెప్పగా.. శ్రీలల.. 'మీ తీన్మార్ పక్కన పెట్టండి, మా చిచ్చా వచ్చిండు ఎట్లుండాలే, కొట్టర కొట్టు సౌమారే' అంటూ గట్టిగా అరవడంతో పాట మొదలైంది.
బాలయ్య పసుపు రంగు కుర్తా, తెల్ల ప్యాంట్ ధరించి, కళ్లజోడు పెట్టుకుని స్టైల్ గా. . శ్రీలలీ పింక్ అండ్ ఎల్లోకాంబినేషన్ కుర్తా ధరించి.. తెలంగాణ యాసలో డైలాగ్ లు చెబుతూ మాస్ బీట్ కు ఎనర్జిటిక్ గా చిందులేసి ఆకట్టుకున్నారు. అయితే ఇదంతా మొన్న ప్రోమోలోనూ చూపించారు.
ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీగానే నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలిసింది. బాలయ్య కెరీర్ లో ఎక్కువ జరిగిందట. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 19న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.